షుగర్‌ ఉన్నవాళ్లు ఈ పంచదారను తినొచ్చ..! మొక్క నుంచి వచ్చిన మధురం..!

-

షుగర్‌ వచ్చిందంటే.. షుగర్‌కు దూరంగా ఉండాలి. పంచదార చాలా ప్రమాదకరం. కనిపించే పాయిజన్‌ అది. చాలా మంది తియ్యగా ఉంటుంది అని పంచదారతో చేసిన స్వీట్స్‌ను లైక్‌ చేస్తారు కానీ.. అసలు ఈ పంచదారకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ముఖ్యందా డయబెటిస్‌ రోగులు పంచదారను పొరపాటున కూడా తినకూడదు. కానీ స్వీట్స్‌ను ఇష్టపడే వాళ్లు సడన్‌గా వాటిని మానేయమంటే మానలేరు. అందుకే నాచురల్‌ స్వీట్స్‌ను ఎంచుకుంటారు. చక్కెరకు ప్రత్యామ్నాయంగా తీసుకునే కృత్రిమ స్వీటేనర్లు కూడా ఆరోగ్యానికి మంచిది కాదనే వాదన ఎక్కువగా వినిపిస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. వీటిని తీసుకోవడం వల్ల జీవక్రియకి అంతరాయం కలుగుతుంది. నాచురల్‌ స్వీటనర్స్‌ తీపి తినాలనే కొరికల్ని మరింత పెంచి బరువు పెరిగేందుకు దారి తీసేలా చేస్తుంది. కానీ ఈ పంచదారను షుగర్‌ రోగులు హ్యాపీగా తినొచ్చు. ఎలాంటి రిస్క్‌ ఉండదు.

మాంక్ ఫ్రూట్ షుగర్ ప్రయోజనాలు

మాంక్ ఫ్రూట్ నుంచి ఈ పంచదార తయారు చేస్తారు. మొక్క నుంచి వచ్చే సహజ స్వీటేనర్ ఇది. ఈ పండు చిన్నగా, గుండ్రంగా ఉంటుంది. చైనా, థాయిలాండ్ వంటి కొన్ని ప్రాంతాలకి చెందినది. సంప్రదాయ చైనీస్ ఔషధాల్లో దీన్ని ఎన్నో శతాబ్దాల నుంచి వాడుతున్నారు. ఇది షుగర్‌కి మంచి ప్రత్యామ్నాయంగా ప్రజాదరణ పొందింది. ఇప్పుడిప్పుడే దీని వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి కేలరీలు జోడించకుండా తీపి రుచిని ఇది అందిస్తుంది. మోగ్రోసైడ్స్ అనే సమ్మేళనాలు ఇందులో ఉన్నాయి. అందుకే వాటికి రుచి తీపిగా ఉంటుంది. రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంచుకోవాలని అనుకునే వాళ్ళకి, తక్కువ కేలరీలు, కార్బోహైడ్రేట్ ఆహారాన్ని తీసుకోవాలనుకునే వారికి ఇది ఉత్తమమైన ఎంపిక. ఇందులో ఉండే ఎరిథ్రిటాల్ అనేది షుగర్ ఆల్కహాల్, ఇది జీరో గ్లైసెమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటుంది కాబట్టి.. డయబెటీస్‌ రోగులు హ్యాపీగా ఇది తీసుకోవచ్చు.

ఎంత వరకు సురక్షితం

మాంక్ ఫ్రూట్ స్వీటేనర్ అనేది మన దగ్గర చాలా కొత్తది. 2010 వరకు దీన్ని ఎఫ్డీఏ సురక్షితమైనదిగా పరిగణించలేదు. దీని తీపి టేబుల్ షుగర్ కంటే తియ్యగా ఉంటుంది. జీరో కేలరీలు కలిగి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఆరోగ్య ప్రయోజనాలు అందించినప్పటికీ దీనిపై మరింత పరిశోధన అవసరం. మాంక్ ఫ్రూట్ స్వీటేనర్‌ని ఇప్పుడిప్పుడే సాధారణంగా సురక్షితంగా పరిగణిస్తున్నారు. అయితే ఏదైనా అలర్జీలు ఉంటే మాత్రం దీన్ని తీసుకోకూడదంటున్నారు నిపుణులు.

Read more RELATED
Recommended to you

Latest news