హైదరాబాద్ లో దారుణం.. బాలుడి గొంతు కోసిన ఆటో డ్రైవర్

-

హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా అభం శుభం తెలియని చిన్నపిల్లలపై దారుణాలకు ఒడిగడుతున్నారు. తనకు దక్కని సంతోషాన్ని భార్యకు కూడా దూరం చేసేందుకు కన్న కూతురుని గొంతు కోసిన ఘటన మరువ ముందే.. ఇప్పుడు మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బాలుడిని ఆటో డ్రైవర్ అతిదారుణంగా గొంతు కోసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్ లోని జగద్గిరిగుట్టలో పోలీస్ స్టేషన్ లో దారుణం చోటు చేసుకుంది. బాలుడిని చంపేందుకు ఆటోడ్రైవర్ యత్నించడం కలకలం రేపింది. కల్పకాలనీలో ఆడుకుంటూ ఉన్న తొమ్మిదేళ్ల బాలుడిని ఆటో డ్రైవర్ యత్నించడం కలకలం రేపింది. హకల్పకాలనీలో ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలుడిని ఆటోడ్రైవర్ గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాలుడికి మాయమాటలు చెప్పాడు ఆటో డ్రైవర్. తన ఆటోలో ఎక్కించుకున్నాడు. ఆ తరువాత పక్క వీధిలోకి తీసుకెళ్లి ఒక్కసారిగా బాలుడిపై దాడికి దిగాడు. ఏం జరుగుతుందోనని ఆ బాలుడు తెలుసుకునే లోపే బాలుడి గొంతు కోసేశాడు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణానికి పాల్పడిన ఆటోడ్రైవర్ పరారీలో ఉన్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news