లక్ష్మీదేవి కటాక్షం మనపై ఉంటేనే సిరిసంపదలు కలుగుతాయని పండితులు అంటారు. అవమానిస్తే మనిషే ఊరుకోడు.. అలాంటిది దేవుళ్లు ఊరుకుంటారా చెప్పండి. మీరు అన్నాన్ని అవమానిస్తే.. భవిష్యత్తులో ఆకలితో ఉండాల్సిన రోజులు వస్తాయి, అలాగే లక్ష్మీదేవిని అవమానిస్తే.. లక్ష్మి ఇంటి నుంచి వెళ్లిపోతుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే వాటిని గౌరవంగా చూసుకోవాలి. డబ్బు లెక్కించేప్పుడు, ఇచ్చేప్పుడు, ఖర్చుపెట్టేప్పుు అంతెందుకు డబ్బును పట్టుకునేప్పుడు కూడా కొన్ని నియమాలు ఉంటాయి. డబ్బును లెక్కించేటప్పుడు గుర్తుంచుకోవలసిన అనేక విషయాలు ఉన్నాయని పండితులు అంటున్నారు. చాలామంది ఆ విషయాలు తెలియక తప్పుగా లెక్కేస్తుంటారట.
వాస్తుశాస్త్రం ప్రకారం.. డబ్బు ఉంచే సంచిలో ఆహార పదార్థాలు పెట్టకూడదు. కొంతమంది చాక్లెట్లు, సోంపు వంటివి పెడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల డబ్బుకు అవమానం జరుగుతుందట. ఫలితంగా లక్ష్మీదేవికి కోపం వస్తుందని సమాచారం. అంతేకాదు ఎవరైనా పేదవారు, యాచకులకు డబ్బులు దానం చేసేటప్పుడు నోట్లను గాని, నాణేలను కానీ విసిరి వేయకూడదు .. ఇలా చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించినట్లే.
చాలా మంది నోట్లో ఉన్న ఉమ్ముతో తడి చేస్తూ నోట్లను లెక్కిస్తారు. నోట్లను లెక్కించేటప్పుడు, ఉమ్మివేసి లెక్కించకూడదని గుర్తుంచుకోండి. నోట్లను లెక్కించేటప్పుడు నీరు లేదా పొడిని వాడాలి. అంతే తప్ప నోట్లో ఉమ్మిని వేళ్లకు రాసుకుని డబ్బులను లెక్కించడం లక్ష్మీదేవిని అవమానించడమే అవుతుంది.
డబ్బును ఎప్పుడూ మంచం పక్కన ఉంచకూడదు. పరిశుభ్రమైన ప్రదేశంలో లేదా భద్రంగా ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఫలితంగా లక్ష్మీదేవి అనుగ్రహం నిలబడుతుంది. డబ్బులను, కొద్దిపాటి మొత్తం అయితే పర్సులలో, ఎక్కువ మొత్తం అయితే అల్మరాలలో పెట్టడం మంచిది. వంట గదిలో పోపు డబ్బాలలో, ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పెట్టడం మంచిది కాదని తెలుసుకోవాలి.
కౌంటింగ్ చేస్తున్నప్పుడు మీ చేతి నుండి డబ్బు పడిపోతే, దానిని తీసుకొని మీ నుదిటిని తాకడం మర్చిపోవద్దు.
ఇవి చాలా చిన్నవే అయినా చాలా పెద్ద పాత్ర వహిస్తాయి. కాబట్టి ఈ పొరపాట్లను నివారించండి. లక్ష్మీదేవి కృపకుపాత్రులుకండి.!