కేంద్రం అందిస్తున్న స్కీమ్స్ లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కూడా ఒకటి. చాలా వరకు స్కీముల కి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్ ని లెక్క లోకి తీసుకుంటున్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కి కూడా అలానే చేస్తున్నారు. ఆధార్ కార్డుకు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్‌లోకే డబ్బులని వేస్తున్నారు. ఆధార్ కార్డునే పరిగణలోకి తీసుకుంటున్నారు.
ఇప్పుడు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) కింద కార్మికులకు కూడా ఈ ఆధార్ అనేది కీలకంగా మారనుంది. కార్మికులకు చెల్లింపులు చేయడానికి ఆధార్ ఆధారిత చెల్లింపు విధానాన్ని చేయబోతోంది. గడువు ఆగస్టు 31 వరకే ఉంది. ఆ తర్వాత ఈ గడువు పొడిగించబడదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నమోదైన వాళ్లకి వేతనాలు చెల్లించేందుకు ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థను ఇక గవర్నమెంట్ అయితే తప్పనిసరి చేసింది. ABPS మోడ్‌ను తప్పనిసరి చేసే గడువును ఫిబ్రవరి 1 వరకు తర్వాత మార్చి 31 వరకు, తర్వాత జూన్ 30 వరకు, చివరికి ఆగస్టు 31 వరకు ఎక్స్టెండ్ చేసింది.