వ్యూహాలు రచిస్తున్న కాంగ్రెస్‌.. మరో కీలక కమిటీ..

-

రానున్న ఎన్నికల్లో నెగ్గి అధికారంలోకి రావాలని భావించే పార్టీల్లో కాంగ్రెస్‌ ముందు వరుసులో ఉంటుంది. అయితే.. ఈ నేపథ్యంలోనే వ్యూహాలు రచిస్తున్నారు కాంగ్రెస్‌ అధిష్టానం పెద్దలు. అయితే.. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ 16 మందితో పార్టీ ఎన్నికల కమిటీని ప్రకటించింది. పదహారు మంది సభ్యులు గల ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల నుండి టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది.

Congress reviews membership drive ahead of internal polls - The Shillong Times

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ కమిటీని ఏర్పాటు చేశారని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం తెలిపారు. ఖర్గేతో పాటు పార్టీ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అంబికా సోనీ, అధిర్ రంజన్ చౌదరి తదితరులకు చోటు దక్కింది.

కమిటీ సభ్యులు వీరే…. మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అంబికా సోనీ, అధిర్ రంజన్ చౌదరి, సల్మాన్ ఖుర్షీద్, మధుసూదన్ మిస్త్రీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీఎస్ సింగ్ ఢియో, కేజే జార్జ్, ప్రీతమ్ సింగ్, మొహమ్మద్ జవెద్, అమీ యజ్నిక్, పీఎల్ పునియా, ఓంకార్ మార్కమ్, కేసీ వేణుగోపాల్.

Read more RELATED
Recommended to you

Latest news