చంద్రబాబు నాయుడు అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఒక కేసులో రిమాండ్ కు వెళ్లడంతో టీడీపీ బలహీనత బయటపడింది. గతంలో చాలా సార్లు రాజకీయ నాయకులు చెప్పిన విధంగా, చంద్రబాబు ఉన్నంతవరకే టీడీపీ బ్రతికి ఉంటుందని, ఇప్పుడు తాత్కాలికంగా చంద్రబాబు కొన్ని రోజులు పార్టీ కార్యక్రమాలకు మరియు ప్రజలకు దూరంగా ఉండడంతో కార్యకర్తలు మరియు క్యాడర్ లో అసంతృప్తి నెలకొంది. నారా లోకేష్ కు అంత దమ్ము లేకపోవడం పైగా ప్రజలు ఆయన్ని పూర్తిగా స్వాగతించకపోవడం వంటి కారణాలతో ఇంకా సమయం పట్టె అవకాశం ఉంది. ఇప్పుడు చంద్రబాబు త్వరగా బెయిల్ మీద విడుదల అయ్యి రాకపోతే పార్టీకి చాలా డామేజ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే గతంలో వైఎస్ మరణం తర్వాత… జగన్ ను జైల్లో పెట్టిన సమయంలో తల్లి విజయమ్మ మరియు చెల్లెలు షర్మిల లు ప్రజల్లోకి వచ్చి ఓదార్పు యాత్రను చేశారో ?
ఇప్పుడు అదే విధంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మరియు నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి ప్రజల్లోకి వస్తారా ? అంటూ పొలిటికల్ వర్గాలలో వినిపిస్తోంది. మరి ఇది జరుగుతుందా ? ఇందుకు వారిద్దరూ అంగీకరిస్తారా ? ఇలా చాలా సందేహాలు ఉన్నాయి.