ఆ తొమ్మిది మెడికల్ కళాశాలల్లో కేసీఆర్ సర్కార్ ది పైసా లేదు : ఎంపీ అరవింద్

-

సీఎం కేసీఆర్ ఇవాళ ప్రారంభించిన 9 మెడికల్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వానిది నయా పైసా లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. మెడికల్ కళాశాలల నిర్మాణం కోసం కేంద్రం నుంచి పూర్తి సాయం అందిందని తెలిపారు. ఇంకా పనులు, సౌకర్యాలు పూర్తి చేయకముందే ప్రారంభించారని మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనే ఆదరబాదరగా కేసీఆర్ ప్రారంభించారని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిధులతో 9 మెడికల్ కళాశాలలు ప్రారంభించారని చెప్పారు.

దేశ వ్యాప్తంగా మోడీ తీసుకున్న పాలసీ వల్ల వైద్యుల సంఖ్య రెండింతలు పెరిగిందని తెలిపారు. తెలంగాణలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రాన్ని బిచ్చమెత్తుకునేలా సీఎం కేసీఆర్ తయారు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి కళాశాలల్లో ప్రొఫెసర్లు, సిబ్బంది పై కేసీఆర్ శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రుల్లో మౌళిక సదుపాయాలు లేవని.. రోగులను ఎలుకలు కొరుకుతున్నాయని ఆరోపించారు. పిల్లలను ఎత్తుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని.. కేసీఆర్ ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. కేంద్రం మెడికల్ కళాశాలలకు అనుమతి ఇవ్వలేదని విమర్శించారని కేంద్రం అనుమతి ఇవ్వకపోతే.. 9 మెడికల్ కళాశాలలు ఎలా ప్రారంభించారని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news