జనసేన-బీజేపీకి ఆ సీట్లు..టీడీపీ రెడీ.!

-

టిడిపి-జనసేన  పొత్తు ప్రకటించిన తర్వాత రాష్ట్రమంతా రాజకీయంగా ఎన్నికల హడావిడి మొదలైందని చెప్పవచ్చు. పవన్, బిజెపితో కలిసి ఉన్నానని ఇద్దరికీ మధ్య  సత్సంబంధాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు. ఇప్పుడు పవన్,  టిడిపి తో పొత్తు ప్రకటన చేశారు.  బిజేపీ కూడా టిడిపి తో కలుస్తుందా? లేదా? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

బిజెపిని పవన్, టిడిపితో కలపాలని ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ బీజేపీ, టీడీపీతో కలవాలి అంటే వైసీపీతో ఉన్న బంధాలను రద్దు  చేసుకోవలసి ఉంటుంది. బిజెపి, టిడిపి తో పొత్తు కోరుకోవటం లేదు కానీ జనసేన, టిడిపి తో పాటు బిజెపి కలిస్తే కేంద్రంలో కూడా తమకు పట్టు ఉంటుందని పవన్ ఆలోచిస్తున్నారు.

టిడిపి, బిజెపి మధ్యవర్తిగా పవన్ వ్యవహరించి వీరే ఇద్దరి మధ్య పొత్తును ఏర్పాటు చేయాలి అనుకుంటున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక బిజెపి కూడా పొత్తులో ఉంటే..జనసేన-బి‌జే‌పికి కలిపి 8 నుంచి 9 ఎంపీ సీట్లు పొత్తులో వీరికి వచ్చే అవకాశం ఉంది. 2014లో నాలుగు ఎంపీ స్థానాలలో బిజెపి పోటీ చేసింది, వాటిలో రెండు సొంతం చేసుకుంది. గతంలో కన్నా ఈసారి బిజెపికి పట్టు పెరిగిందని చెప్పవచ్చు, అంటే రాష్ట్రంలో ఓట్లు పెరిగాయని కాదు కేంద్రంలో ఒక తిరుగులేని శక్తిగా బిజెపి అవతరించింది.

అందువలన బిజెపి తరఫున అభ్యర్థి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అని రాజకీయ వర్గాల అభిప్రాయం. 25 ఎంపీ సీట్లలో బిజెపి, జనసేనకి 9 మాత్రమే టిడిపి ఇస్తుందని రాజకీయ వర్గాలు చెబుతున్నారు. వీటిలో బిజెపి ఎన్ని స్థానాలలో పోటీ చేస్తుందో? జనసేనకు ఎన్ని ఇస్తుందో? వారి వారి బలాబలాలను బట్టి తెలుసుకోవాలి అని టిడిపి చెబుతోంది. మరి టిడిపి చెప్పిన ఒప్పందాలకు బిజెపి ఒప్పుకుంటుందా? బిజెపి,  టిడిపి మధ్య పొత్తు పొడుస్తుందా? లేదా? అనేది  ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది …..ఏమవుతుందో వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news