కిలో ధర రూ.2 పలకని టమోటా.. రైతుల ఆవేదన

-

గత రెండు నెలల క్రితం దేశ వ్యాప్తంగా మంట పుట్టించిన టమాటా.. ఇప్పుడు చవకై పోయింది. కిలో రూ.300కు పలికి చుక్కలు చూపించి.. ఇప్పుడు పాతాళానికి పడిపోయింది. దీంతో రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో టమాటా ధరలు భారీగా పడిపోయాయి. కిలో టమోటా రూ. 2 కూడా పలకడం లేదు. రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో ఇదే పరిస్థితి నెలకొందని రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ధరలు తగ్గడం సామాన్యులకు మంచిదే అయినప్పటికీ.. టమాటా రైతులకు మాత్రం కోలుకోని నష్టం అని చెప్పవచ్చు. కనీసం పండించిన పంటకు కూలీల ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పండించిన పంటకు గిట్టుబాట ధరలు లేక రోడ్లపై పారబోస్తున్నారు.

இன்று சென்னை கோயம்பேடு சந்தையில் மீண்டும் தக்காளி விலை கிலோவுக்கு ரூ.20  உயர்வு - lifeberrys Tamil இந்தி

ఇది ఇలా ఉంటె, కూలీలు, తోటకు కొట్టే మందుల ధరలు కూడా పెరగడంతో టమోటా రైతులకు పంట భారంగా మారిందని చిత్తూరు జిల్లా ఎడమవారిపల్లెకు చెందిన రామ్మూర్తి అనే రైతు ఆందోళన వ్యక్తం చేశారు.‘‘గత 30 ఏళ్లలో మొన్న వచ్చిన ధరలను ఎన్నడూ చూడలేదు. టమోటాలతొ కోట్లు సంపాదించారు అంటే ఈ పంట వేశా. కానీ కాయ కోతకొచ్చేసరికి రేటు పడిపోయింది. ఇప్పుడు కిలో రూ.5 అలా పోతోంది. బాక్స్ ధర రూ.150 ఉంది. బాక్స్ రూ.600 నుంచి రూ.700కు అమ్మితే గిట్టుబాటు అవుతుంది. అంతకంటే తక్కువ అయితే నష్టమే. మందులు, కూలీ రేట్లు ఎక్కువ. ఇంతకుముందు ఒకసారి పురుగు మందు కొట్టేవాళ్లం, ఇప్పుడు పదిసార్లు కొట్టాల్సి వస్తోంది. కాయ కోయడం ప్రారంభించాక రూ.70 వేల విలువైన మందులు వాడాను. చివరకు గిట్టుబాటు కాదని తోటలోనే పంటను వదిలేశా” అని ఆయన వివరించారు. చినగొట్టిగల్లు మండలానికి చెందిన రైతు జనార్దన్‌ది కూడా అదే పరిస్థితి.

Read more RELATED
Recommended to you

Latest news