feaప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా రూపొందుతోంది. ఇద్దరు టాలీవుడ్ యంగ్‌స్టర్స్ అయిన మెగాపవర్ స్టార్ రామ్‌చరణ, యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి నటిస్తోన్న ఈ సినిమాపై జాతీయ స్థాయిలోనే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జోడీగా ప్రముఖ బాలీవుడ్ నటి ఆలియా భట్ నటిస్తుంది. ఎన్టీఆర్ కి హీరోయిన్ ఇంకా కుదరలేదు. దాదాపు ఆరేడు నెలలుగా ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ను సెట్ చేసేందుకు రాజమౌళి ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కావడం లేదు.
ఇక ఇప్పటికి కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమా ఆడియో గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ ఇండస్ట్రీ వర్గాల ద్వారా బయటకు వచ్చింది. రాజమౌళి సినిమా…. అందులోనూ ఓ పీరియాడికల్ కథకు, ఫిక్షన్ జోడించి తెరకెక్కిస్తున్నాడు… ఇద్దరు టాలీవుడ్ యంగ్ క్రేజీ హీరోలు ఉన్నారు ? ఇందులో ఎన్ని సాంగ్స్ ఉంటాయో ? అన్న ఆసక్తి సహజంగానే అందరిలోనూ ఉంది.
ఇక లేటెస్ట్ లీక్ టాక్ ప్రకారం ఆర్ ఆర్ ఆర్ లో ఏడు పాటలు వుంటాయనే టాక్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. దేశభక్తిని .. చైతన్య స్ఫూర్తిని రగిల్చే పాటలు రెండు.. మూడు ఉంటాయనీ, తన జోడీతో చరణ్ .. తన జోడీతో ఎన్టీఆర్ పాడుకునే రొమాంటిక్ సాంగ్స్ వుంటాయట. ఈ ఏడు పాటల్లో సుద్దాల అశోక్ తేజ మూడు పాటలను రాశారు.
ఇక ఈ పాటలకు కీరవాణి తనదైన స్టైల్లో అదిరిపోయే మ్యూజిక్ ఇస్తున్నాడట. ఇక రాజమౌళి కూడా అటు సన్నివేశాలను .. ఇటు పాటలను బ్యాలెన్స్ చేస్తూ ఈ కథను రక్తి కట్టించనున్నాడు. వచ్చే యేడాది ఈ సినిమాను రిలీజ్ చేస్తామని చెప్పినా షూటింగ్ లేట్ అవ్వడంతో 2021లోనే సినిమా వస్తుందని అంటున్నారు.