ఈ మధ్యనే డ్రగ్స్ కేసులో పంజాబ్ లో అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వం కాంగ్ర్రెస్ ఎమ్మెల్యే సుఖ్ పాల్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో ఇండియా కూటమిలో భాగంగా ఉన్న ఆప్ మరియు కాంగ్రెస్ ల మధ్యన విభేదాలు మొదలయ్యాయని మరియు త్వరలోనే ఇండియా కూటమి నుండి ఆప్ వైదొలగనుంది అంటూ రాజకీయ వర్గాలు గుసగుసలు ఆడుకుంటున్నారు. ఈ రూమర్స్ కు చెక్ పెడుతూ ఆప్ అధినేత మరియు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు. మేము ఇప్పుడు ఎప్పుడూ ఇండియా కూటమిలోని ఉంటాము.. అతి త్వరలోనే ఎన్నికల్లో సీట్ల పంపకం పైన ఒక క్లారిటీ రానుంది అంటూ కేజ్రీవాల్ తెలియచేయడం జరిగింది.
ఇండియా కూటమిలోని పార్టీలు అన్నీ కూడా చాలా కమిట్మెంట్ తో మోదీ ప్రభుత్వాన్ని కూలదోయడమే టార్గెట్ గా పెట్టుకుని ముందుకు వెళుతున్నారు. కాగా ఎన్నికలకు ముందు ఎప్పటిలాగే మోదీ ప్రజలను మభ్య పెట్టే పథకాలను తీసుకువస్తాడేమో చూడాలి.