తెలంగాణ సీఎం కేసీఆర్కు తన కళ్లలోకి సూటిగా చూసే ధైర్యం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘తెలంగాణలో ఎవరు అధికారంలో ఉండాలో ప్రజలే నిర్ణయిస్తారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే అధికారం. తెలంగాణ ప్రజలు నాపై నమ్మకం ఉంచాలి. బీజేపీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. బీఆర్ఎస్ దోచుకున్న సొమ్మంతా పేదలకు పంచుతా. కాంగ్రెస్ వాళ్లు చెప్పే తప్పుడు మాటలు నమ్మవద్దు’ అని మోదీ పేర్కొన్నారు.
అంతేకాకుండా.. కర్ణాక ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కు మద్దుతు ఇచ్చిందని ప్రధాని మోడీ తెలిపారు. కర్ణాటక ఎన్నికల తరహాలో బీఆర్ఎస్ డబ్బులు కుమ్మరించాలని చూస్తున్నారని ఆరోపించారు. కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలే.. కాంగ్రెస్ కు డబ్బులు అందజేశారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల డబ్బును కర్ణాటకలో ఖర్చు పెట్టారని.. దక్షిణ భారతదేశాన్ని మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది మోడీ అన్నారు. ఆలయాల సంపదను తీసుకుంటున్నారు, మైనార్టీ ప్రార్థనాస్థలాల జోలికి మాత్రం వెళ్లరని తెలిపారు. ఎంత జనాభా ఉంటే.. అంత హక్కు అని కాంగ్రెస్ అంటోందని.. అధికార దాహంతో కాంగ్రెస్ అల్లాడుతోందని మండిపడ్డారు.