ముదిరాజ్‌ల జోరు..ఈటల ట్విస్ట్..సీట్లు ఇచ్చినోళ్లకే ఓట్లు.!

-

తెలంగాణ రాజకీయాల్లో బీసీలదే హవా అని చెప్పవచ్చు. వారికే గెలుపోటములని శాసించే సత్తా ఉంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. అందులో ముదిరాజ్‌ల వర్గం ముఖ్యమైన పాత్ర. అయితే గెలిపించేది బి‌సిలు గాని..వారికి మాత్రం రాజ్యాధికారం దక్కడం లేదు. ఇదే సమయంలో ఇంతకాలం అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీని ఆదరిస్తూ వస్తున్న ముదిరాజ్ వర్గానికి సరైన న్యాయం జరగడం లేదు. ఏళ్ల తరబడి వారి హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా బీసీ-డి నుంచి బీసీ-ఏ జాబితాలో చేర్చాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు.

కానీ కే‌సి‌ఆర్ ప్రభుత్వం ఆ డిమాండ్‌ని పట్టించుకోవడం లేదు. అయితే ఈటల రాజేందర్ బి‌ఆర్‌ఎస్ నుంచి బయటకొచ్చాక బి‌ఆర్‌ఎస్ లో ఇంకా ముదిరాజ్‌ వర్గానికి చెందిన నాయకులకు కీలక పదవులు ఏమి దక్కలేదు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే..ఇటీవల కే‌సి‌ఆర్ బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధులని కూడా ప్రకటించారు. కానీ ఒక్క సీటు కూడా ముదిరాజ్ వర్గానికి కేటాయించలేదు. దీంతో ఆ వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. తెలంగాణలో అత్యధిక ఓట్లు ముదిరాజ్ వర్గానికి ఉన్నాయి. కానీ వారికి ఒక్క సీటు ఇవ్వలేదు. ఈ క్రమంలో ముదిరాజ్‌లంతా ఐక్యమయ్యారు.

 

తాజాగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో  ముదిరాజుల ఆత్మగౌరవ సభ పెట్టారు. దీనికి రాష్ట్రంలోని కీలక నేతలంతా హాజరయ్యారు. రాష్ట్రం నలుమూలల నుంచి ముదిరాజ్ వర్గం తరలివచ్చింది. భారీ స్థాయిలో సభ జరిగింది. ఈ క్రమంలో వారు తమ హక్కుల కోసం గళం విప్పారు. ఇటు బి‌జే‌పి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సైతం తీవ్ర స్థాయిలో కే‌సి‌ఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అటు ముదిరాజ్ సంఘం నేతలు, ఇతర రంగాల్లో రాణిస్తున్న ముదిరాజ్ వర్గానికి చెందిన వ్యక్తులు వచ్చారు. టీవీ, సినీ రంగంలో రాణిస్తున్న బిత్తిరి సత్తి సైతం సభకు హాజరయ్యారు.

May be an image of one or more people and crowd

అయితే రాష్ట్రంలో దాదాపు 11 శాతం జనాభా ఉన్న ముదిరాజ్ వర్గానికి బడ్జెట్ లో రూ.20 వేలు కోట్లు కేటాయించాలి. కానీ చేప పిల్లల పేరుతో కేవలం రూ.500 కోట్లు మాత్రమే కేటాయిస్తున్నారని ఆ వర్గం మండిపడుతుంది. అలాగే ఎవరైతే ముదిరాజ్‌లకు ఎక్కువ సీట్లు ఇస్తారో..వారికే ఓట్లు వేస్తామని ముదిరాజ్ వర్గం నేతలు తీర్మానించారు.

May be an image of 1 person, crowd and text

ఇక 2008లో వైఎస్సార్..మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్, ముదిరాజ్‌లని బీసీ-డి నుంచి బీసీ-ఏకి మారుస్తామని ప్రకటించారు. కానీ ఒక ఏడాది మాత్రం బీసీ-ఏలో పెట్టారు. తర్వాత రిజర్వేషన్ అంశం సుప్రీకు చేరడం..అటు ముస్లిం ఎమ్మెల్యేలు దాదాపు ఏడుగురు ఎమ్మెల్యేల వరకు ఉండటం, వారు పోరాటంతో ముస్లిం రిజర్వేషన్ అంశం నెగ్గడం..వారికి 4 శాతం వచ్చింది.

కానీ ముదిరాజ్‌ల కేటగిరీ మార్చే అంశాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో మళ్ళీ బీసీ-డి వచ్చింది. అందుకే ఇప్పుడు బీసీఏ లోకి మార్చాలని పోరాడుతున్నారు. మొత్తానికి తమకు ప్రాధాన్యత ఇస్తూ..ఎక్కువ సీట్లు ఇచ్చిన పార్టీకి ఈ సారి ఎన్నికల్లో ఓటు వేస్తామని ముదిరాజ్‌లు చెబుతున్నారు. దీంతో ఒక్క సీటు కూడా ఇవ్వని బి‌ఆర్‌ఎస్ పార్టీకి నష్టం తప్పదు.

Read more RELATED
Recommended to you

Latest news