ఈ రోజు వరల్డ్ కప్ లో జరిగిన రెండవ మ్యాచ్ లో ఇంగ్లాండ్ మరియు సౌత్ ఆఫ్రికాలు తలపడుతున్నాయి. మొదట టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జాన్ బట్లర్ ఫీల్డింగ్ ఎంచుకుని ఎంత తప్పు చేశాడో సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత అర్థమై ఉంటుంది. సౌత్ ఆఫ్రికా మొదట రెండు సెంచరీ ల వీరుడు డి కాక్ అవుట్ అయినా, ఆ ఆ తర్వాత హెన్డ్రిక్స్ 85, డస్సెన్ 60 పరుగులు చేసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. మరోసారి మార్కురామ్ (42) చక్కటి ఆరంభాన్ని అందుకున్నా భారీ స్కోర్ గా మలచడంలో ఫెయిల్ అయ్యాడు. ఇక ఆ తర్వాత క్లాజెన్ (109) మరియు జాన్సెన్ (75) లు ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఈ వరల్డ్ కప్ లో క్లాజెన్ రెండవ సెంచరీ చేయగా ఇతనికి జాన్సెన్ చక్కని సహకారం అందించాడు.
ఫలితంగా సౌత్ ఆఫ్రికా నిర్ణీత ఓవర్ లలో 7 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. ఈ స్కోర్ ను ఛేదించడం ఇంగ్లాండ్ కు చాలా కష్టమనే చెప్పాలి.. ఆఫ్గనిస్తాన్ పైనే ఓడిపోయిన ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా పై గెలుస్తుందా చూడాలి.