అందరూ ఊహించిందే జరిగింది.. రాజగోపాల్ రెడ్డిపై బూర నర్సయ్య సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా గురించి నడుస్తోంది. రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేయడంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన బూర నర్సయ్య గౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇదేమి పెద్ద బ్రేకింగ్ న్యూస్ కాదు.. అందరూ ఊహించనదే అని తెలిపారు. రాజగోపాల్ రెడ్డి శరీరం మాత్రమే బీజేపీలో ఉందని.. ఆత్మ కాంగ్రెస్ లోనే ఉండిందని కీలక వ్యాఖ్యలు చేశారు బూర నర్సయ్య. రాష్ట్రంలో కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితిలో జనాలు లేరని పేర్కొన్నారు. కేసీఆర్ ని ప్రగతి భవన్ నుంచి ఖాళీ చేయించి పనిలో రాజకీయాలకతీతంగా ప్రతీ ఒక్కరూ ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తనకు భువనగిరి పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని ఉందని చెప్పారు. అయితే అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి అక్కడి నుంచి చేస్తానని ఓ క్లారిటీ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే.. ముందు నుంచి బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని బీజేపీ భావిస్తోంది. రాజగోపాల్ రెడ్డిపై బూర నర్సయ్యగౌడ్ ను పోటీకి దింపాలనేది బీసీ యోచనలో ఉంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి స్థానం నుంచి పోటీ చేసిన బూర నర్సయ్యగౌడ్ కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై విజయం సాధించారు.

Read more RELATED
Recommended to you

Latest news