పీఎం ఈ-బస్‌సేవ పథకం.. త్వరలోనే 169 నగరాల్లో అందుబాటులోకి 10వేల ఎలక్ట్రిక్ బస్సులు

-

ప్రస్తుతం ప్రపంచ ఆటో మొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ట్ వాహనాల ట్రెండ్ నడుస్తోంది. ఓ వైపు ప్రభుత్వాలు ఈ-వాహనాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంటే.. మరోవైపు ప్రజలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకే మక్కువ చూపుతున్నారు.. పర్యావరణ పరిరక్షణలో తమ వంతు తోడ్పాటును అందిస్తున్నారు. ఈ క్రమంలోనే పర్యావరణ హితం కోసం కేంద్ర సర్కార్ ఓ వినూత్న పథకం తీసుకువచ్చింది. అదే పీఎం ఈ-బస్ సేవా పథకం.

ఈ పథకంలో భాగంగా.. దేశవ్యాప్తంగా 169 నగరాల్లో 10వేల ఎలక్ట్రిక్‌ బస్సుల్ని పరుగులు పెట్టించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. మొదట 3వేల బస్సుల్ని సేకరించేందుకు ముందడుగు వేస్తోంది. 3 లక్షల నుంచి 40 లక్షల మధ్య జనాభా ఉన్న నగరాలు ఈ పథకం పరిధిలోకి రానున్నాయని కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి మనోజ్‌ జోషీ వెల్లడించారు. ఇందుకోసం వచ్చే వారంలో టెండర్లు పిలిచే అవకాశమున్నట్లు తెలిపారు. ఈ పథకంలో రాష్ట్రాల భాగస్వామ్యం కూడా ఉంటుందని వివరించారు.

ఈ- బస్సుల్లో జీపీఎస్‌తో పాటు ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో అనుసంధానమై కదలికలు ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ఆయా చోట్ల… వచ్చే పదేళ్ల పాటు ఈ-బస్‌ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news