తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టిడిపి దూరం ?

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తెలుగుదేశం పార్టీ తప్పకున్నట్లు తెలుస్తోంది. నిన్న రాజమండ్రి జైలులో చంద్రబాబు, కాసాని జ్ఞానేశ్వర్ ఎన్నికలపై చర్చించారు. ఎన్నికల బరిలో నిరుద్దామని కాసాని కోరగా, చంద్రబాబు నిరాకరించినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణపై ఫోకస్ పెట్టలేమని, నామమాత్రంగా పోటీ చేసే బదులు, పూర్తిగా దూరంగా ఉంటేనే మంచిదని చెప్పినట్లు తెలుస్తోంది.

కాగా గత మూడు రోజుల నుంచి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరతారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకపోతే… యాదవ వర్గానికి చెందిన జ్ఞానేశ్వర్ కచ్చితంగా భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాదు మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంచేందుకు సీఎం కేసీఆర్ కూడా నిర్ణయం తీసుకున్నారట. మరి దీనిపై తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news