ఖానాపూర్ ను కేటీఆర్ దత్తత తీసుకున్నాడు.. జాన్సన్ నాయక్ గెలుపు ఖాయం ముఖ్యమంత్రి కేసీఆర్ దీమా వ్యక్తం చేశారు. తాజాగా ఖానాపూర్ లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరై మాట్లాడారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. 1956 వరకు మన రాష్ట్రం మనకే ఉండే.. జబర్దస్త్ గా బలవంతంగా విలీనం చేసింది. ఆనాడు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులు నోరు మూస్కోని కూర్చున్నారు. 58 సంవత్సరాల తరువాత ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో ఏం జరిగింది..? బీఆర్ఎస్ పాలనలో ఏం జరిగింది ? ఒక్కసారి ఆలోచించాలని కోరుతున్నట్టు తెలిపారు. ఈసారి ఎన్నికల్లో గెలిచిన తరువాత పెన్షన్స్ అన్ని రూ.5000 చేయనున్నట్టు తెలిపారు. మహిళల కోసం కళ్యాణలక్ష్మీ, షాదిముబారక్, కేసీఆర్ కిట్, ఒమ్మఒడి వాహనాలతో పాటు తదితర సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కింది. గిరిజనులకు తండాలను గ్రామపంచాయతీలుగా మార్చామని తెలిపారు. 3,600 నుంచి 4వేల వరకు ఎస్టీ బిడ్డలు తమ గ్రామపంచాయతీలను ఏలుతున్నారు అని తెలిపారు.