ఈ నెల 20 నుంచి ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు ఇస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఆరోగ్యశ్రీ సద్వినియోగంపై ముమ్మర ప్రచారం చేయాలని..దీనిలో ఎమ్మెల్యేలు పాల్గొనాలని కోరారు. ఆస్పత్రుల్లో సిబ్బంది లేరన్న మాట వినిపించొద్దని సీఎం జగన్ పేర్కొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు వైద్య చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి సకాలానికి మందులు ఇవ్వాలని పేర్కొన్నారు సీఎం జగన్. ఆస్పత్రుల్లో ఎక్కడా సిబ్బంది లేదనే మాట వినపడకూడదు, ఖాళీలు ఉండకూడదని స్పష్టం చేశారు.ప్రజారోగ్య రంగంలో ఆరోగ్య శ్రీ అన్నది విప్లవాత్మక మార్పు అన్నారు. ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని ఆదేశాలు ఇచ్చారు.
జగనన్న ఆరోగ్య సురక్ష పై నిరంతరం సమీక్ష చేయాలి…ఆరోగ్య సురక్షలో మూడు ప్రధాన అంశాలపై దృష్టి సారించాలి..రోగులకు మందులు అందించడం, అనంతరం ఫాలో అప్ చేయాలని కూడా ఆదేశించారు. చికిత్స అవసరమైన వారిని ఆస్పత్రులకు పంపించేటప్పుడు వారికి రవాణా ఖర్చుల కింద రూ.500లు ఇవ్వాలన్నారు.