షారుఖ్ ఖాన్.. బాలీవుడ్ బాద్ షా అంటూ ఆయనను పిలుచుకుంటారు ఆయన అభిమానులు. వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉండే ఈ సొట్ట బుగ్గల చిన్నోడంటే ముఖ్యంగా యువతులు పడి చచ్చిపోతుంటారు. చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న షారుఖ్ కు కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ తప్పలేదు.
తన ఇంట్లో గణపతి విగ్రహాన్ని పెట్టుకొని పూజించాడని.. షారుఖ్ పై కొంతమంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వినాయక చవితి సందర్భంగా షారుఖ్ తన ఇంట్లో గణపతి విగ్రహాన్ని పెట్టి పూజించాడట. ఫ్యామిలీ అంతా కలిసి గణపతి పూజలో పాల్గొన్నారట. తన చిన్నకొడుకు అభిరామ్ వినాయకుడికి మొక్కుతుండగా తీసిన ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశాడు షారుఖ్. అంతే.. ఇక ట్రోలింగ్ స్టార్టయింది సోషల్ మీడియాలో. తన భార్య గౌరీ ఖాన్ హిందువన్న విషయాన్ని కూడా మరిచిపోయి నెటిజన్లు షారుఖ్ ను టార్గెట్ చేయడంతో దీనిపై పెద్ద చర్చే నడుస్తున్నది.