‘మీర్జాపూర్‌’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సీజన్- 3 రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

-

‘మీర్జాపూర్‌’…. ఈ పేరు తెలియని ఓటీటీ ప్రేక్షకుడు ఉండడు. ఓటీటీలో రికార్డు స్థాయిలో వ్యూస్‌ సాధించిన ఈ వెబ్‌సిరీస్కు కోట్ల మంది ఫ్యాన్స్. భాషతో సంబంధం లేకుండా ఈ సిరీస్ను ఆదరించారు. ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లు సూపర్ హిట్ టాక్ను సంపాదించాయి. ఇక సోషల్ మీడియాలో ఈ సిరీస్లోని క్యారెక్టర్లతో వచ్చే మీమ్స్కు ఉండే క్రేజే వేరు. అందుకే ఈ క్రేజ్ చూసిన క్రియేటర్స్ ఈ సిరీస్లో మరో సీజన్ తెరకెక్కిస్తున్నారు.

మీర్జాపూర్- సీజన్ 3 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు తెగ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్కు సంబంధించి నెట్టింట ఓ అప్డేట్ బాగా వైరల్ అవుతోంది. ఈ సిరీస్ మూడో సీజన్ మార్చి చివరి వారంలో అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ప్రసారం కానున్నట్లు సమాచారం. ఏడాది క్రితమే దీని షూటింగ్‌ పూర్తి కాగా ఇప్పుడు పోస్ట్‌ ప్రొడక్షన్‌, డబ్బింగ్‌ పనులు పూర్తి చేసుకొన్న ఈ సిరీస్‌ విడుదలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గుర్మీత్‌ సింగ్‌ దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్లో పంకజ్‌ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్‌, శ్రియ పిల్గోంగర్‌, హర్షిత గౌర్‌ తదితరులు నటించారు. ఇక మూడో సీజన్లో విజయ్ వర్మ కీలకపాత్రలో కనిపించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news