మన సంస్కృతిని, చరిత్రను ఎప్పుడూ తప్పుగా చూపించను : ప్రశాంత్ వర్మ

-

‘హనుమాన్‌’ మూవీతో ఈ ఏడాదిలో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తాజాగా ఇంగ్లీష్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయన భారతీయ పురాణాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను తన సినిమాల్లో ఎప్పుడూ భారతీయ సంస్కృతిని, చరిత్రను తప్పుగా చూపించనని తెలిపారు. రామాయణ, మహాభారతాలను నేటి ప్రేక్షకులకు తన శైలిలో చెప్పాలనుకుంటున్నానని, కానీ, వాటిని తీసేంత అనుభవం లేదన్న ప్రశాంత్ వర్మ.. అందుకే వాటి స్ఫూర్తితో కొత్తగా కల్పిత కథలను రూపొందిస్తున్నానని వెల్లడించారు.

 

ఇండస్ట్రీలో రామాయణం, మహాభారతం ఆధారంగా ఎన్నో చిత్రాలు వచ్చాయని.. నందమూరి తారక రామారావు గారు ఇలాంటివి ఎన్నో చేశారని కానీ, ఎప్పుడూ విమర్శలు ఎదుర్కోలేదు అని ప్రశాంత్ వర్మ అన్నారు.  “మాకు ఎన్టీఆరే కృష్ణుడు, రాముడు. చాలా ఇళ్లలో దేవుడి విగ్రహాలతో పాటు ఆయన పోస్టర్లు ఉంటాయి. టాలీవుడ్‌ సినిమాల్లో దేవుళ్లను ఎప్పుడూ తప్పుగా చూపించలేదు. నేను ఈ జానర్‌లో వచ్చిన చిత్రాలన్నీ చూస్తాను. కొన్ని చూసినప్పుడు సినిమా ఎలా తీయాలో నేర్చుకుంటే.. మరికొన్నిటిని చూసి ఎలా తీయకూడదో తెలుసుకున్నా. ఇలాంటివి సున్నితమైన అంశాలు. జాగ్రత్తగా తెరకెక్కించాలి’’ అని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news