విద్యారంగాన్ని విస్మరించిన టీడీపీకి ఓటు వేస్తారా ? : సీఎం జగన్

-

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ మాట్లాడారు. విద్యారంగాన్ని విస్మరించిన టీడీపీకి ఓటు వేస్తారా..? అని ప్రశ్నించారు సీఎం జగన్.  ముఖ్యంగా నూటికి దాదాపు 30 మంది ఆడపిల్లలు పదోతరగతి పూర్తి చేసిన పరిస్థితి లేదు అన్నారు. వాస్తవాలు ఎలా ఉన్నా పట్టించుకోలేదు. బాల్యవివాహాలను ఆపే పరిస్థితి కూడా లేదన్నారు. తల్లికి ఎన్నో ఆశలు ఉన్నా.. వారి బిడ్డ ఆశయాన్ని నెరవేర్చే బాధ్యత తల్లుల చేతుల లేకుండా పోయింది. ధనికులకు అందే చదువును పేద పిల్లలకు కూడా అందిస్తున్నామని తెలిపారు సీఎం జగన్. 58 నెలల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.

గత ఎన్నికల్లో కర్నూలులో క్లీన్ స్వీప్ చేశాం.. ఈసారి కూడా అలాగే ఫలితాలు రావాలని కోరారు. మహిళల కోసం గత ప్రభుత్వం ఏం చేయలేదు. పేదలు, మహిళల సంక్షేమం కోసమే తమ ప్రభుత్వ హయాంలో ఎంతో మేలు జరిగిందన్నారు. మహిళల కోసం గత ప్రభుత్వం ఒక్క పథకం కూడా తీసుకురాలేదు. ఇళ్ల పట్టాలిచ్చిన వైసీపీ ప్రభుత్వానికి మరోసారి పట్టం కట్టాలని కోరారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news