విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు : సీఎం జగన్

-

విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ మాట్లాడారు. పిల్లలు బడిబాట పట్టాలని అమ్మ ఒడి పథకం తీసుకొచ్చాం. పిల్లల చేతుల్లో ట్యాబ్లు, ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చాం. పిల్లల మీద ఇంత ధ్యాస పెట్టటం గతంలో ఎప్పుడైనా జరిగిందా? అని ప్రశ్నించారు.  పెద్ద చదువుల  కోసం పూర్తి రీయింబర్స్ మెంట్ ఇస్తున్నాం. ప్రతి గుండె ఐదేళ్లుగా మంచి జరిగిందని చెబుతున్నాయి.

మా గవర్నమెంట్ స్కూళ్లు బాగుపడ్డాయని.. ప్రతి గుండె చెబుతోంది. కార్పోరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దాం. అమ్మ ఒడి, విద్యా దీవెన ద్వారా పిల్లలను ప్రోత్సహిస్తున్నాం. పిల్లల చదువుల గురించి గతంలో ఏ పాలకులు పట్టించుకోలేదు. పేదరికం నుంచి బయటపడాలంటే పిల్లలు చదువుకోవాలి పిల్లల చదువుల గురించి చంద్రబాబు ఏనాడు ఆలోచన చేయలేదు అన్నారు. ధనికులకు అందే చదువును పేదలకు అందజేస్తున్నాం అని తెలిపారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news