నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష తేదీ ఖ‌రారు..

-

‘దిశ’ హత్యాచార ఘటనతో.. మళ్లీ ‘నిర్భయ’ కేసు తెరపైకి వచ్చింది. ఆ మృగాళ్లకు ఎప్పుడు శిక్ష పడుతుందని.. దేశవ్యాప్తంగా.. ప్రజలందరూ.. ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ నెల 16న ఉదయం 5 గంటలకు నలుగురు నిర్భ‌య కేసులోదోషులకు ఈ శిక్ష అమలు చేస్తున్నట్లు తిహార్‌ జైలు అధికారులు చెప్పారు. తమకు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ మేరకు ఆదేశాలు అందినట్లు తెలిపారు. ప్రస్తుతం దోషులు తిహార్‌ జైలులోనే ఉన్న విషయం తెలిసిందే. వారిని ఉరి తీసేందుకు జైలు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాగా, అది 2012, డిసెంబర్‌ 16వ తేదీ.. ఢిల్లీలో ఆరుగురు మృగాళ్లు నిర్భయపై దాడి చేసి అత్యాచారం చేశారు.

అయితే యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది ఈ ఘటన. ఈ దారుణ ఘటనలో తీవ్రంగా గాయపడిన నిర్భయ మృతి చెందింది. ఆమెపై ఈ ఘాతుకానికి పాల్పడిన డిసెంబర్‌ 16నే ఈ కేసులో నలుగురు దోషులను ఉరి తీయనున్నారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు దోషులుగా తేలిన విషయం తెలిసిందే. వీరిలో ఒకరు జూవైనల్‌ కోర్టు విధించిన శిక్ష అనుభవించాడు. మరో దోషి రామ్‌సింగ్‌ జైలులోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దోషులకు శిక్ష అమలులో జరిగిన ఆలస్యంపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news