భూములు దోచేసే చట్టం తీసుకొచ్చారు : పవన్ కళ్యాణ్

-

కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ముఠా కూలీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజలు భయపడకుండా బతకాలన్నదే తన కోరిక అని అన్నారు. 112 మంది జర్నలిస్టులపై దాడులు జరిగాయి. పత్రికలు, ఛానళ్లను కట్టడి చేసేందుకు జీవో నెం.1ని తెచ్చారు. భూములు దోచేసే చట్టాన్ని అసెంబ్లీలో చర్చ లేకుండానే తెచ్చారు. మన ఆస్తి మనదని 90 రోజుల్లో నిరూపించుకోలేకపోతే దోచుకుంటారా..? అని ప్రశ్నించారు.

రాష్ట్ర భవిష ఈ ఎన్నికలు ఎంతో కీలకమని, ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మనా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు భయపడకుండా బతకాలన్నదే తన కోరికని..  సమస్యల పరిష్కార బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. వైసీపీ పాలనలో 112 మంది జర్నలిస్టులపై దాడులు జరిగాయి. 430 కేసులు నమోదు చేశారు. అసెంబ్లీలో చర్చ జరగకుండానే, భూములు దోచేసే చట్టం తీసుకొచ్చారు. మన ఆస్తి. మనదని రుజువుస్కోవాలా? 50 రోజుల్లో రుజువు చేసుకోకపోతే దోచుకుంటారా? వంద గజాల భూమి ఉన్న వ్యక్తి కూడా న్యాయం కోసం హైకోర్టు తలుపు తట్టాలా? అని పవన్ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news