పారిశ్రామిక రంగం తెలంగాణ నెత్తిన పాలు పోస్తుందా…! ఇప్పుడు జరుగుతుంది అదే…!

-

తెలంగాణ గత అయిదేళ్ళుగా ఎన్నో ఇబ్బందులు పడింది… అప్పటి వరకు ఉద్యమ నాయకుడిగా మాత్రమే పేరున్న ముఖ్యమంత్రి కెసిఆర్… పాలన మీద ఊహించని విధంగా పట్టు పెంచుకుంటూ వచ్చారు… మిగులు నిధులను ప్రజలకు పంచడమూ మొదలుపెట్టారు. అయితే ఆదాయం పెరగడంలో మాత్రం తెలంగాణ ఇబ్బంది పడింది… హైదరాబాద్ లాంటి రాజధాని ఉన్నా సరే కొన్ని కారణాలతో కంపెనీలు వెనకడుగు వేసాయి… ఆదాయం వస్తున్నా సరే ఏదో వెలితి ప్రభుత్వాన్ని వేధించింది…

అయితే ఇప్పుడు వాటిని అన్నింటిని కెసిఆర్ సర్కార్ అధిగమించింది. రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత కెసిఆర్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. పారిశ్రామిక రంగం తెలంగాణ వైపు చూసే విధంగా… ప్రభుత్వ విధానాల్లో ఎన్నో మార్పులు చేస్తూ వచ్చారు. సీనియర్ అధికారులతో ఎప్పటికప్పుడు మంత్రి కెసిఆర్ సమీక్షలు జరుపుతూ ప్రముఖ కంపెనీలను మళ్ళీ హైదరాబాద్ వైపు చూసే విధంగా చేయడానికి తీవ్రంగానే శ్రమించారు.. ఒక పక్కా ప్లాన్ రూపొందించింది… తలుపులు తెరిచారు…

అంబాని, అధాని, లులు గ్రూప్ వంటి ఎన్నో కంపెనీలు ఇప్పుడు హైదరాబాద్ గడప తొక్కుతున్నాయి… త్వరిత గతిన భూములు కేటాయించడం, ఫైల్స్ త్వరగా క్లియర్ చేయడం, రాయితీల విషయంలో వెసులుబాట్లు, కొన్ని నిబంధనల సడలింపు వంటివి కేటిఆర్ చేసారు. దీనితో ఇతర దేశాల్లో ఉన్న కంపెనీలు కూడా ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలు కూడా తెలంగాణకు కలిసి వచ్చాయి. త్వరలోనే మరికొన్ని సంస్థలు తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి సిద్దమవుతున్నాయి… ఇన్నాళ్ళు తమను వెంటాడిన వెలితిని… కేటిఆర్ క్లియర్ చేయడంలో దాదాపుగా విజయవంతం అయ్యారు… ఇప్పుడు హైదరాబాద్ కూడా ఆదాయంలో దూసుకుపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news