బాబు కుప్పం కోట కూలిపోనుందా? ఓటమి ముప్పు ఉందా?

-

2019 ఎన్నికల్లోకుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో 73 శాతం పోలింగ్ నమోదు అయితే.. ఈసారి కుప్పంలో 89.88 శాతం ఓటింగ్ నమోదైంది. దీంతో వైసీపీ విజయానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఓవైపు పక్కాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న మాట కూటమి నుంచి వస్తున్నా.. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయంటూ అధికార వైసీపీ నేతలు చెబుతున్నారు. రెండోసారి తమదే గెలుపు అన్న విషయంపై విపక్షంతో పోలిస్తే అధికారపక్షం తన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తోంది. దీంతో.. కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. వైసీపీ ధీమీ వెనుకున్న లెక్కేంటి? అన్న అంశంపై తీవ్రంగా శోధించటం మొదలైంది. ఈ సస్పెన్స్ మరో పది రోజుల్లోపు తీరిపోనుంది. అయితే.. దీనిపై రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

మ‌నోళ్ల‌కు తిప్పలు ఏం జ‌రిగింది? ఇదంతా ఒక ఎత్తు అయితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బరిలో ఉన్న పిఠాపురంతో పోలిస్తే.. చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో ఓటమి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న కొత్త చర్చ షురూ అయ్యింది. దీనికి తగ్గట్లే వైనాట్ 175? ఆపరేషన్ లో భాగంగా కుప్పం మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ప్రత్యేకంగా ఫోకస్ చేయటం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల నుంచే కుప్పం మీద ప్రత్యేక ఫోకస్ పెట్టిన జగన్.. చంద్రబాబుకు కంచుకోట లాంటి కుప్పం కోటకు బీటలు వారేందుకు అవసరమైన ప్రయత్నాలన్ని చూశారు.

ల‌క్ష‌ల ఓట్లు.. ఏక‌ప‌క్ష‌మేనా? వైసీపీ ఏం చెబుతోందంటే! దీంతో.. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఈసారి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యే ఛాన్సులు లేవా? అన్నది చర్చగా మారింది. కుప్పంలో వైసీపీ జెండా ఎగిరే అవకాశాలు ఎన్ని? చంద్రబాబుకు దిమ్మ తిరిగే షాకు తప్పదన్న మాటలో వాస్తవం ఎంత? అసలీ చర్చలో నిజమెంత? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. వీటికి సమాధానాలు వెతికితే.. తొలుత చంద్రబాబు కుప్పం కోటకు బీటలు వారాయన్న వాదనలో పస ఉందా? లేదా? అన్నది చూడాలి. నిజానికి ఈ వాదనకు ప్రధానకారణం.. వైసీపీ ఆవిర్భావం తర్వాత నుంచి చంద్రబాబు మెజార్టీకి గండి పడుతూ.. ప్రతి ఎన్నికకు ఆయన గ్రాఫ్ పడిపోతున్న దుస్థితి.

ఈసారి దొంగ ఓట్లు భారీగా తొలగించిన నేపథ్యంలో సమీకరణాలు మారాయని చెబుతున్నారు. తనను ఏడుసార్లు గెలిపించిన కుప్పం ప్రజలకు చంద్రబాబు స్థాయిలో చేయాల్సింది చాలానే ఉన్నా.. అదేమీ చేయలేదన్న విమర్శ అంతకంతకూ పెరిగేలా చేయటంలో వైసీపీ విజయం సాధించినట్లుగా చెప్పాలి.దీనికి తోడు కుప్పం మీద ప్రత్యేక ఫోకస్ చేసిన సీఎం జగన్.. అక్కడ భారీ ఎత్తున డెవలప్ మెంట్ కార్యక్రమాల్ని చేపట్టటంతో గడిచిన ఐదేళ్లలో కుప్పం రూపురేఖల్లో మార్పు వచ్చేసింది.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జరగని ఎన్నో పనులు.. ఆయన విపక్ష నేతగా ఉన్నప్పుడుజరగటంతో కుప్పం ప్రజల మైండ్ సెట్ లో మార్పులు వచ్చినట్లుగా చెబుతున్నారు. 2019 ఎన్నికల్లోకుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో 73 శాతం పోలింగ్ నమోదు అయితే.. ఈసారి కుప్పంలో 89.88 శాతం ఓటింగ్ నమోదైంది. దీంతో వైసీపీ విజయానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కుప్పం నియోజకవర్గానికి హంద్రీనీవా కాలువ ద్వారా క్రిష్ణా జలలాలు తీసుకొచ్చిన తర్వాతే ఓటు అడగటానికి వస్తానని చెప్పిన సీఎం జగన్.. చేతల్లోనూ అదే తీరును చూపటంతో ఈసారి మార్పు మీద పెద్ద చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు. అందుకు తగ్గట్లే ఈసారి ఎన్నికల్లో మహిళలు పెద్ద ఎత్తున ఓటేయటంతో కొత్త చర్చ మొదలైంది. ఈ వాదన ఇలా ఉంటే.. చంద్రబాబుకు అనుకులంగా మరో వాదన ప్రచారంలో ఉంది. వైఎస్ ఫ్యామిలీకి పులివెందుల ఎలా అయితే అండగా ఉందో..

చంద్రబాబుకు కుప్పం అలా ఉండాల్సిన అవసరం ఉందన్న ప్రచారం జోరుగా సాగింది. ఇది అక్కడి ప్రజల మీద ప్రభావం చూపినట్లుగా చెబుతున్నారు. దీనికి తోడు.. ఈసారి ఎన్నికలే చంద్రబాబుకు చివరివి అవుతాయని.. కాబట్టి.. ఆయన్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్న మాట ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి తోడు.. చంద్రబాబు జైలుకు వెళ్లటం కూడా కొంత మేర ప్రభావాన్ని చూపినట్లుగా చెబుతున్నారు. బాబు ఓడిపోతారన్న ప్రచారంతో ఒకలాంటి మైండ్ గేమ్ ఆడారని.. ఆ ట్రాప్ లో కుప్పం ప్రజలు పడరన్న ధీమాను తెలుగు తమ్ముళ్లు వ్యక్తం చేస్తున్నారు. కుప్పం మీద జగన్ ప్రత్యేక ఫోకస్ చేసిన దరిమిలా.. చంద్రబాబు సతీమణి కాలికి బలపం కట్టుకొన్న రీతిలో ఈసారి ఎన్నికల వేళ ప్రత్యేక శ్రద్ధ పెట్టటంతో పాటు.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు. మరి.. ఎవరి వాదన నిజమని తేలాలంటే మాత్రం జూన్ 4 వరకు వెయిట్ చేయక తప్పదు.

Read more RELATED
Recommended to you

Latest news