నేడు మేడిగడ్డకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

-

రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్ట మరమ్మతులను ఉత్తమ్ సమీక్షించనున్నారు. ఎన్​డీఎస్​ఏ కమిటీ సిఫార్సుల మేరకు చేపడుతున్న చర్యల పురోగతిని తెలుసుకోనున్నారు. నీటిపారుదలశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్, ఇతర ఇంజినీర్లతో కలిసి పనులపై ఆరా తీయనున్నారు.

మరోవైపు జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ మధ్యంతర నివేదికలో చేసిన సిఫార్సులకు అనుగుణంగా మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్టల వద్ద మరమ్మతులు, రక్షణ చర్యలకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. మేడిగడ్డ ఆనకట్టలో కీలకమైన గేట్ల ఎత్తివేత పనులు చేస్తున్నారు. ఏడో బ్లాకులోని ఎనిమిది గేట్లకు గాను ఒక గేటును గతంలోనే ఎత్తగా… కుంగిన పియర్స్ మధ్యలో ఉన్న గేటును కటింగ్ ద్వారా తొలగిస్తున్నారు. మిగిలిన ఆరు గేట్లలో 16, 17వ గేట్లను ఎత్తినట్లు ఇంజనీర్లు తెలిపారు. గతంలో 16వ గేటు తెరిచే సమయంలో సాంకేతిక సమస్యలు వస్తే ఆపివేసి… అన్నింటిని సరిచేసిన తర్వాత గురువారం ఎత్తారు. మరో నాలుగు గేట్లను కూడా తెరవాల్సి ఉంది. ఇదే తరహాలో ఆ గేట్లను కూడా తెరిచే ప్రయత్నం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news