కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ అసెంబ్లీలో తీర్మాణం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణ పట్ల కేంద్రం తీరుకు నిరసన చేపట్టాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా అసెంబ్లీలో కేంద్ర బడ్జెట్ పై తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి.  సీఎం ప్రవేశపెట్టిన తీర్మాణానికి సభ  ఏకగ్రీవంగా  ఆమోదం తెలిపింది. కేంద్ర బడ్జెట్ కు సవరణలు చేయాలని డిమాండ్ చేసారు.  ఈ నెల 27న జరుగబోయే  నీతి అయోగ్ కార్యక్రమానికి బహిష్కరించనున్నట్టు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.

పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టమైన హామీ ఇవ్వాలి. రాష్ట్రం నుంచి నిధులు తీసుకునే కేంద్రం.. రాష్ట్రానికి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తీర్మాణం ప్రవేశ పెట్టడానికి ముందు సభ వాడీ వేడిగా కొనసాగింది. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధమే జరిగింది. కేటీఆర్, హరీశ్ రావు సీఎం రేవంత్ పట్ల విరుచుకుపడితే.. భట్టి, రేవంత్, పలువురు మంత్రులు తమ దైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు. మొత్తానికి కేంద్ర బడ్జెట్ పై జరిగిన చర్చలో అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news