ఒలింపిక్స్ : తృటిలో తప్పించుకున్న భారత్..!

-

గత ఒలింపిక్స్ లో కాంస్య పతకం అందుకున్న భారతపురుషుల హాకీ జట్టు ఈ ఏడాది అంతకు మించి ప్రదర్శనా చేసి బంగారు పతకం అందుకోవాలని కసితో ప్యారిస్ ఒలింపిక్స్ లో అడుగు పెట్టింది. కానీ ఇండియా బలమైన జట్లు ఉన్న గ్రూప్ లో పడటంతో ఈసారి పతకం కష్టం అని అందరూ అనుకున్నారు. అందుకు తగ్గిన విధంగానే మొదటి మ్యాచ్ లో బ్యుజీలాండ్ జట్టు పై 3-2 తేడాతో చివరి నిమిషాల్లో గోల్ చేసి విజయం సాధించింది.

ఇక ఈరోజు అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్ లో చివరి రెండు నిమిషాల్లో గోల్ చేసి స్కోర్ సమం చేసి మ్యాచ్ ను డ్రా చేసుకుంది. భారత కెప్టెన్ హర్మాన్ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలిచి జట్టును బతికించాడు అనే చెప్పాలి. ఇక భారత జట్టు తర్వాతి గ్రూప్ మ్యాచ్ ల్లో ఆస్ట్రేలియా, బెల్జియం వంటి కఠినమైన జట్లను ఎదుర్కోవాల్సి ఉంది. చూడాలి మరి ఈ మ్యాచ్ ల్లో భారత జట్టు ఎలా ఆడుతుంది అనేది.

Read more RELATED
Recommended to you

Latest news