రేపు సచివాలయంలో ఉదయం 10 గంటలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖలపై మంత్రి సీతక్క అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష జరగనుంది. భారీ వర్షాల నేపథ్యంలో శాఖల వారిగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేయనున్నారు మంత్రి. పారిశుధ్య నిర్వహణ, తాగు నీటి సరఫరా, రాకపోకల పునరుద్దరణ ప్రణాళిక పై చర్చ జరపనున్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసేలా కార్యాచరణను రూపొందించనున్నారు.
అలాగే వర్షాలు, వరదలు సంభవించినప్పుడు ముందస్తుగానే అప్రమత్తమయ్యేలా మండలాల వారిగా ఫ్లడ్ మేనేజ్ మెంట్ కమిటీల ఏర్పాటుపై కూడా చర్చ జరపనున్నారు. ఇప్పటికే ఈ రకమైన ప్రయోగం ములుగు నియోజకవర్గంలో సక్సెస్ అయ్యింది. కాబట్టి అన్ని గ్రామీణ మండలాల్లో ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీల ఏర్పాటు సాధ్యాసాధ్యాల పరిశీలన చేయనున్నారు. గ్రామాల్లో చెరువులు, వాగులు, కాలువల పై వెలసిన అక్రమ కట్టడాల విషయంలో ఏలా ముందుకు వెల్లాలన్న అంశంపై కూడా చర్చ జరపనున్నారు. ఈ మిట్టింగ్ కు అన్ని శాఖల అధికారులు హాజరుకానున్నారు.