కాంగ్రెస్ మోసాలు, పచ్చి అబద్దాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటన..!

-

తెలంగాణలో.. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతోంది. కాంగ్రెస్ అంటేనే అబద్ధాల పుట్ట. అంకెల గారడీలతో ప్రజలను నిట్టనిలువునా మోసం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటైపోయింది అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అధికారంలోకి రాగానే.. రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేయడమే మా మొదటి లక్ష్యమని వరంగల్ రైతు డిక్లరేషన్ సందర్భంగా కాంగ్రెస్ చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చిన 224 రోజుల తర్వాత రైతుల రుణాలు సగం మాత్రమే మాఫీ అయ్యాయి. ఇలా పచ్చి అబద్ధంతో తెలంగాణ రైతులను నిట్టనిలువునా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ.

మొదట్లో.. అందరు రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ అన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు మాటమార్చి.. ఒక కుటుంబానికి ఒక్కరికి మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్పడం.. మరో దారుణమైన మోసం. రైతులందరికీ రుణమాఫీ అనే మాట నుంచి.. కొందరు రైతులకే రుణమాఫీ చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. అసలు తెలంగాణలో పంటరుణాలు తీసుకున్న రైతులెందరు? రూ.2లక్షల్లోపు రుణాలున్నవారెందరు? మీరు రుణమాఫీ చేసిన వారెందరు? ఈ లెక్కలన్నీ తెలంగాణ ప్రజలకు చెప్పండి. మీరు చెప్పినదాంట్లో మూడోవంతు వారికి కూడా జరగలేదనేది వాస్తవం. తెలంగాణ రైతుల్లో ఈ అయోమయం తొలగిపోవాలంటే.. మీరు అన్నీ లెక్కలు వారి ముందు పెట్టాలని డిమాండ్ చేస్తున్నా. బూటకపు హామీలు ఇవ్వడం, వాటిని అమలుచేయకపోవడం తద్వారా రాష్ట్రంలోని అందరు రైతులకు మోసం చేయడం.. కాంగ్రెస్ పార్టీ విఫల హామీలకు పరాకాష్ట అని కిషన్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news