ఎస్వీబీసి చైర్మన్ పృథ్వీ వ్యవహారం ఇప్పుడు పెను దుమారం రేపుతుంది. ఆయన వ్యవహారంపై టీటీడీ సీరియస్ అయింది. రాజినామా చెయ్యాలని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి ఆదేశించడంతో పృథ్వీ రాజీనామా చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. తనపై వచ్చిన ఆరోపణలతో ఆయన రాజీనామా చెయ్యాలని నిర్ణయం తీసుకోగానే పై నుంచి ఆదేశాలు రావడంతో ఆయన రాజీనామా చేస్తున్నారు.
అమరావతి రైతుల వివాదం సద్దుమణగక ముందే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆయన తీరుపై ఎస్వీబీసి ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయన డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇస్తున్నారని, పద్మావతి గెస్ట్ హౌస్ లో కుర్చుని మందు తాగుతున్నారని ఆరోపణలు చేసారు. ఇక ఆయన ఆడియో టేపుల వ్యవహారంతో టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనితో ఆయన త్వరలో రాజీనామా చేసే అవకాశం ఉందని అంటున్నారు.
మహిళా ఉద్యోగితో ఆయన అసభ్యంగా మాట్లాడిన ఆడియో టేప్ ఒకటి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆమెను వెనుక నుంచి పట్టుకుందాం అనుకున్నా అని, నచ్చావ్ అని, గుండెల్లో ఉన్నావ్ అని, కెవ్వుమని అరుస్తావ్ అందుకే పట్టుకోలేదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం కూడా సీరియస్ అయినట్టు తెలుస్తుంది.