ఎవ్వరొస్తారో రండి.. బుల్డోజర్ తో తొక్కించి మూసీని ప్రక్షాళన చేస్తా : సీఎం రేవంత్ రెడ్డి

-

మూసీని ప్రక్షాళన చేయకపోతే తన జన్మ ఎందుకు అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మూసీ విషంగా మారింది. బీఆర్ఎస్, బీజేపీ మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్నాయి. జెండా, అజెండా పక్కన పెట్టి మూసీ ప్రక్షాళనకు సహకరించండి. ఎవ్వరు అడ్డొచ్చినా మూసీ ప్రక్షాళన చేసి తీరుతా అన్నారు. అవ్వరు అడ్డు వస్తారో రండి.. బుల్డోజర్ తో తొక్కించి ముందుకు వెళ్తా. 30 రోజుల్లో మూసీ ప్రక్షాళనకు డిజైన్లు ఖరారు చేస్తానని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

2025 నూతన సంవత్సరం వాడపల్లి నుంచి హైదరాబాద్ వరకు  కదం తొక్కుతాం. మూసీ నది ప్రక్షాళన చేపడుతాం. బిల్లా, రంగలు రావాలి. వద్దంటే నల్గొండ ప్రజలు మీ నడుంకు రాయి కట్టి మూసీ నదిలో వదులుతారు. నడుస్తామన్న హరీశ్ రావు మీ సవాల్ ని స్వీకరిస్తున్నా.  వాడపల్లిలో మూసీ కృష్ణా నదిలో కలిసే వద్ద పాదయాత్ర మొదలవుతుంది. జనవరిలో వాడపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తామని తెలిపారు. హరీశ్ రావు సవాల్ ను స్వీకరిస్తున్నానని.. దమ్ముంటే హరీశ్ రావు, కేటీఆర్ రావాలని సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news