తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మూసీ నది ప్రక్షాళన కోసం అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తాజాగా హైదరాబాద్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం సభలో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర కేబినెట్ నుంచి తెలంగాణకు కిషన్ రెడ్డి ఎన్నికోట్లు తీసుకొచ్చారు. మెట్రో విస్తరణ పై బీజేపీ విధానం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీ పాలసీ డాక్యుమెంట్లు తీసుకురావాలన్నారు.
మంత్రి వర్గ ఉప సంఘంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు ఉంటారు. అఖిల పక్ష సమావేశంలో ప్రతిపక్షాల ప్రతిపాదనలు, సూచనలు తీసుకుంటుంది. ప్రభుత్వం చేస్తున్న వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్లను కూడా అడ్డుకుంటామన్నారు. దయచేసి నగర అభివృద్దిని అడ్డుకోకండి అని ప్రతిపక్షాలకు సూచించారు. దేశంలో అన్ని నగరాలలో కాలుష్యం ఆక్రమించింది. హైదరాబాద్ నగరంలో ఆక్రమించకుండా భవిష్యత్ తరాల గురించి ఆలోచన చేసి అభివృద్ధి వైపు మా ప్రభుత్వం పయణిస్తుందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.