ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ మొత్తం శాసన మండలి రద్దు చుట్టూ తిరుగుతుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో శాసనమండలిని రద్దు చేస్తూ పార్లమెంటరీ సెక్రటరీ కి అసెంబ్లీ రద్దు చేసిన బిల్లును పంపడం జరిగింది. అయితే అసెంబ్లీలో శాసన మండలి రద్దు చేసే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ శాసన మండలి రద్దు అవటానికి కారణం తెలుగుదేశం పార్టీ నేతల వ్యవహారమని అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అని విమర్శించారు.
అంతేకాకుండా సలహాలు ఇవ్వాల్సిన పెద్దల సభలో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ప్రజలకు ఉపయోగపడే అనేక బిల్లులను అడ్డుకోవటం జరిగిందని శాసన మండలి సాక్షిగా కుట్రపూరిత రాజకీయాలు చంద్రబాబు చేస్తున్నారని అసెంబ్లీలో జగన్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందువల్లనే శాసనమండలిని రద్దు చేస్తున్నట్లు పేర్కొనడం జరిగింది. అయితే శాసన మండలి రద్దు బిల్లు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టిలో ఉన్న నేపథ్యంలో శాసన మండలి రద్దు విషయంలో బిజెపి నేతలు ఆలస్యం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తాజాగా వార్తలు బయటకు వచ్చాయి.
దీంతో ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ఒకవేళ శాసన మండలి రద్దు కాకపోతే వచ్చే ఏడాది మార్చిలో మండలిలో మనదే మెజారిటీ ఉంటుందని అప్పుడు బిల్లు ఎవరు అడ్డుకుంటారో చూద్దాం అని వైసీపీ పార్టీ నేతలతో అన్నట్లు ఏపీ మీడియా వర్గాల్లో టాక్. దీంతో నిజంగా జగన్ కి చిత్తశుద్ధి ఉంటే శాసన మండలి రద్దు బిల్లును కేంద్రం దగ్గర రద్దుచేసుకునే వారని కావాలని శాసనమండలిని రద్దు విషయంలో జగన్ డబుల్ గేమ్ ఆడుతున్నారు అంటూ టిడిపి ఆరోపిస్తోంది.