బిగ్ బ్రేకింగ్ : ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ వాయిదా….. భారీ దెబ్బేసిన రాజమౌళి ….!!

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో బాహుబలి రెండు భాగాలు తీసి మన దేశంతో పాటు విదేశాల్లో కూడా అత్యద్బుతమైన పేరు, కలెక్షన్స్ అందుకున్న దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ఆర్ఆర్ఆర్. తొలిసారిగా మెగా నందమూరి స్టార్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ సినిమాను రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ తెలంగాణ విప్లవ వీరుడు కొమరం భీంగా, అలానే రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు.

కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు రాజమౌళి తండ్రి వి విజయేంద్ర ప్రసాద్ కథను సమకూరుస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ చాలావరకు పూర్తి అయిందని, అలానే అనుకున్న విధంగా 2020 జులై 30న తమ సినిమాని రిలీజ్ చేస్తామని ఆర్ఆర్ఆర్ యూనిట్ కొద్దిరోజుల క్రితం ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది. అయితే అందరికీ షాక్ ఇస్తూ నేడు కాసేపటి క్రితం ఆ సినిమా యూనిట్ తమ సినిమా రిలీజ్ డేట్ మారిందని, ఆడియన్స్ కి మరింత బెస్ట్ క్వాలిటీ సినిమా అందించాలనే ఉద్దేశ్యంతో వారికి కాస్త ఇబ్బంది కలిగించిప్పటికీ తమ సినిమా రిలీజ్ డేట్ మార్చవలసి వస్తోందని ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది.

 

ఇక తాజా డేట్ ప్రకారం ఈ సినిమా జనవరి 8, 2021 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కానుంది ఆర్ఆర్ఆర్. దీనితో ఈ సినిమా కోసం ఎంతో ఎదురుచూపులు చూస్తున్న వారందరూ కూడా ఒక్కసారిగా నిరాశకు లోనయ్యారు. అయితే సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ కు చాలా సమయం పడుతున్నందువల్లనే వాయిదా వేయవలసి వచ్చిందని టాలీవుడ్ వర్గాల టాక్. మరి ఇప్పటికే రెండవసారి వాయిదా పడ్డ ఈ సినిమా, ప్రస్తుతం చెప్తున్న డేట్ కు అయినా రిలీజ్ అవుతుందో లేదో అని సందేహం వ్యక్తం చేస్తున్న వారు కూడా లేకపోలేదు….!!

Read more RELATED
Recommended to you

Latest news