ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్…ఢిల్లీ పర్యటన పట్ల రకరకాల వార్తలు ఏపీ మీడియా వర్గాల్లో వినబడుతున్నాయి. ముఖ్యంగా ఏపీ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ నేతలు కేసుల విషయంలో బిజెపి పార్టీ పెద్దలతో కాళ్ల బేరం కుదుర్చుకుని రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి జగన్ బయలుదేరడం జరిగిందని విమర్శలు చేస్తున్నారు. మరోపక్క జాతీయస్థాయిలో జగన్ ఢిల్లీ టూర్ వెనుక బిజెపి ఏ జగన్ కి సరెండర్ అయిందని..దానికి కారణం బహుశా ఎన్నికల ఓటమిని రకరకాల కథనాలు వినబడుతున్నాయి.
అయితే జగన్ ఢిల్లీ టూర్ వెనుక వైసీపీ పార్టీ వర్గాల నుండి అందుతున్న టోటల్ మ్యాటర్ ప్రకారం…ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వికేంద్రీకరణ పేరిట తెరపైకి వచ్చిన మూడు రాజధానులు అంశాన్ని ప్రధాని మోడీ కి వివరించినట్లు ఇదే తరుణంలో అమరావతి రాజధాని పేరిట చంద్రబాబు హయాంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన భూ దోపిడిని మోడీ మరియు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లా బోతున్నట్లు పార్టీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. అంతేకాకుండా విశాఖనే రాజధానిగా ఎందుకు చేయాలనుకుంటుంది కూడా జగన్ వివరించనున్నారు.
ఇక శాసనమండలి రద్దు అంశం కూడా ప్రస్తావనకు రానుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే శాసనమండలి రద్దు బిల్లును ప్రవేశపెట్టాలని జగన్ ఢిల్లీ పర్యటనలో మోడీని కోరనున్నట్లు సమాచారం. అలాగే పునర్విభజన చట్టం ప్రకారం లోటు బడ్జెట్ కలిగిన రాష్ట్రానికి నిధుల విషయంలో కేంద్రం నుండి రావాల్సిన నిధులు గురించి కూడా జగన్ ఈ పర్యటనలో మోడీని అడగనున్నట్లు వైసిపి పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మొత్తం మీద మూడు నెలల తర్వాత మోడీ మరియు అమిత్ షా తో జగన్ భేటీ కావడం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది.