సవతి కూతురికి నరకం చూపించిన వ్యక్తి కి యావజ్జీవశిక్ష

-

2017 లో సంచలనం సృష్టించిన ఒక దారుణ ఘటనకు సంబంధించి కోర్టు తాజాగా నిందితుడికి శిక్షను ఖరారు చేసింది. మైనర్ అయిన సవతి కూతురిని కిడ్నప్ చేసి ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకోవడమే కాకుండా 9 మంది పిల్లలకు తల్లిని చేసి చిత్ర హింసలకు గురి చేసిన హెన్రి మైకెల్ పియోట్(65) కు ఓక్లహామా ఫెడరల్ కోర్టు పియెట్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధించినట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే….. రోసాలీన్ మెక్ గిన్నీస్ తల్లి హెన్రి మైకెల్ పియెట్ తో డేటింగ్ లో ఉంది. అయితే ఆ సమయంలో అతడి వేధింపులు తట్టుకోలేక అతడికి దూరంగా ఉండాలని నిర్చయించుకొని కూతురు మెక్ గిన్నీస్ ను తీసుకొని వేరుగా ఉండడం మొదలు పెట్టింది. అయితే 1997 లో తనకు వదిలి వెళ్ళిపోయింది అన్న కోపం తో మెక్ గిన్నీస్ చదువుతున్న స్కూల్ వద్దకు వెళ్లి ఆమెను కిడ్నాప్ చేశాడు. అంతటితో ఆగకుండా మైనర్ అయిన గిన్నిస్ ను అక్కడ నుంచి మెక్సికో కు తీసుకెళ్లి నిర్బంధించాడు. మెక్సికోలోని ఓ షెడ్డులో గిన్నీస్‌ను నిర్బంధించిన పియెట్.. ఆమెపై పలుమార్లు అత్యాచారంకి పాల్పడి ప్రత్యక్ష నరకం చూపించాడు. మెక్సికో వెళ్లిన తర్వాత ఎన్నో మారుపేర్లు పెట్టుకున్న పియెట్.. రొసాలిన్‌ను తన రూపం మార్చుకోవాల్సిందిగా బలవంతం చేసేవాడు.షెడ్డు నుంచి తాను బయటకెళ్లినప్పుడు తాళం వేసి వెళ్లేవాడు. మొదట్లో పారిపోవాలని ప్రయత్నించిన రొసాలిన్.. ఆ తర్వాత నిస్సహాయ స్థితిలో,మానసిక స్థైర్యం కోల్పోయి అక్కడే చిక్కుకుపోయింది. ఈ క్రమంలో పియెట్ ఆకృత్యాల కారణంగా ఆమె 9మంది పిల్లలకు తల్లి అయింది. 2000వ సంవత్సరంలో 15 ఏళ్ల వయసులో ఆమె మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన బిడ్డల ఆలనా పాలనా కూడా గాలికి వదిలేసి అందర్నీ షెడ్డులోనే నిర్బంధించి అరకొర తిండి పెట్టి వేధించాడు. ఈ క్రమంలో ఆమె పెద్ద కొడుకు ఇంటి నుంచి పారిపోయాడు కూడా. అయితే ఇన్ని సంవత్సరాలుగా నరకం అనుభవిస్తున్న రొసాలిన్ కూడా ఎలాగైనా అక్కడినుంచి బయటపడాలని నిశ్చయించుకుంది.

అలా 2016లో ఎలాగోలా తన 8 మంది పిల్లలతో ఆ ఇంటి నుంచి బయటపడి అమెరికన్ ఎంబసీ అధికారులను ఆశ్రయించింది. 1997 నుంచి దాదాపు 20 ఏళ్లుగా తాను అనుభవించిన నరకం గురించి పియెట్ ఆకృత్యాల గురించి వారికి వివరించడం తో పియెట్ పై అధికారులు కేసు పెట్టినట్లు తెలుస్తుంది. దీనితో ఓక్లహామా పోలీసులు 2017లో అతన్ని అరెస్ట్ చేశారు. కేసును విచారించిన ఓక్లహామ ఫెడరల్‌ కోర్టు పియెట్‌కు జీవిత ఖైదు విధించింది. అయితే రొసాలిన్‌కు జరిగిన అన్యాయం పూడ్చలేనిది అని జీవితకాలం ఆమెను భయంకరమైన జ్ఞాపకాలు వేధిస్తాయని అమెరికా అటార్నీ బ్రియాన్‌ జే. కుస్టర్‌ పేర్కొన్నారు. ఆమె పట్ల సానుభూతి తెలపడం తప్ప చేయగలిగిందేమీ లేదని వాపోయారు. అలాగే 50వేల డాలర్ల జరిమానాతో పాటు.. బాధితురాలికి 50,067డాలర్ల పరిహారం చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. 2017లో మొదటిసారి హెన్రీ ఆకృత్యం వెలుగుచూడగా అప్పటినుంచి కోర్టులో విచారణ జరుగుతూనే ఉండగా తాజాగా నిందితుడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news