టీడీపీ కి వంగవీటి రాధా రాజీనామా ??

-

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బెజవాడ ప్రాంతం చాలా కీలకమైంది. అంతేకాకుండా బెజవాడ రాజకీయాలను శాసించే కుటుంబాలలో వంగవీటి కుటుంబం కూడా ఒకటి. ఇటువంటి నేపథ్యంలో వంగవీటి కుటుంబంలో ప్రస్తుతం వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. గతంలో వైసీపీ పార్టీలో కీలకంగా రాణించిన వంగవీటి రాధా ఇటీవల సరిగ్గా 2019 సార్వత్రిక ఎన్నికల ముందు టిడిపి పార్టీలో జాయిన్ అయ్యారు. Image result for vangaveeti radhaకాపు సామాజిక వర్గానికి చెందిన వంగవీటి రాధాని చంద్రబాబు 2019 ఎన్నికల ప్రచారంలో బాగానే వాడారు. కృష్ణా మరియు ఉభయగోదావరి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారానికి రంగంలోకి దింపడం జరిగింది. అయినా గానీ పెద్దగా ఫలితాలు సాధించలేని పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు మరియు ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, విజయవాడ నుండి వంగవీటి రాధా ని ప్లాన్ ప్రకారం సైడ్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారట.

 

దీంతో ఈ వార్తలు రావడంతో తెలుగుదేశం పార్టీకి వంగవీటి రాధా రాజీనామా చేయటానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. మరోపక్క బెజవాడలోనే తన బలాన్ని నిలబెట్టుకునేలా వంగవీటి సరైన రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

Read more RELATED
Recommended to you

Latest news