అల్లు అర్జున్ మహేష్ బాబు నే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు .?

-

సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ సినిమాలలో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలు బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీగా నిలబడ్డాయి. అయితే కలెక్షన్స్ విషయంలో మహేష్ బాబు కంటే అల్లు అర్జున్ రికార్డ్ నెలకొల్పాడంటూ మెగా ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకుంటున్నారు. కలెక్షన్స్ విషయంలో బన్నీ నే మహేష్ బాబు కంటే పై స్థాయిలో నిలిచాడని విశ్లేషకులు ప్రకటించారు. ఇక సినిమా రిలీజ్ కాక ముందే థమన్ పాటలతో యూట్యూబ్ షేకయిపోయింది. ఈ విషయంలో సరిలేరు సక్సస్ కాలేదు.

 

దేవిశ్రీ ప్రసాద్ ఉన్నా కూడా సరిలేరు ఆడియో క్లిక్ అవలేదు. మెగా కాంపౌండ్ మాట ప్రకారం అల వైకుంఠపురంలో సినిమాలోని ఒక్క పాటకు వచ్చిన వ్యూస్ సరిలేరు నీకెవ్వరు సినిమా మొత్తం ఆల్బంకు రాలేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆడియో సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డు సాధిస్తే ఇప్పుడు వీడియో సాంగ్స్ కూడా అదే స్థాయిలో రికార్డ్ సాధిస్తున్నాయని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమాలోని మైండ్ బ్లాక్ అలాగే అల వైకుంఠపురంలోని రాములో రాముల వీడియో సాంగ్స్ కొన్ని రోజుల తేడాలో రిలీజయ్యాయి. ఈ రెండు సాంగ్ యూట్యూబ్ లో పోటీ పడ్డాయి. అయితే పోటీలో మైండ్ బ్లాక్ పాట బాగా వెనుకపడి పోయింది. రాములో రాముల పాట మిలియన్ ల వ్యూస్ తో దూసుకు పోతుంది.

అలాగే బుట్ట బొమ్మ వీడియో సాంగ్ కు కూడా అద్బుతమైన రెస్పాన్స్ వస్తుంది. సినిమా వచ్చి చాలా రోజులైనా ఇప్పటికే ఓటీటీ పై వచ్చినా కూడా పాటలకు మాత్రం విపరీతమైన క్రేజ్ ఉందంటూ మెగా ఫ్యాన్స్ అంటున్నారు. సినిమా కలెక్షన్స్ విషయంలోనే కాదు వీడియో సాంగ్స్ విషయంలో కూడా మహేష్ ని అల్లు అర్జున్ బీట్ చేశాడని అంటున్నారు. అయితే కేవలం మహేష్ బాబు ని టార్గెట్ చేస్తూ ఇలా కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది అభిప్రాయపడ్డారు. వాస్తవానికి ఈ ఇద్దరు హీరోలు ఇవన్ని పట్టించుకోకుండా వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మరి ఫ్యాన్స్ ఎందుకు ఇలా అనవసరంగా కానెంట్స్ చేస్తుంటారో అర్థం కాదు.

Read more RELATED
Recommended to you

Latest news