ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల చిచ్చు ఇప్పుడు ప్రభుత్వంలో పెద్ద అలజడికి కారణం అయిందనే వ్యాఖ్యలు ఇప్పుడు ఎక్కువగా వినబడుతున్నాయి. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఈ పరిణామంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అసలు తనకు చెప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికలను ఏ విధంగా వాయిదా వేశారని అదేవిధంగా అధికారులను ఏవిధంగా బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారని సీఎం జగన్ ఇప్పుడు మండిపడుతున్నారు.
అయితే ఇక్కడ నిఘా విభాగం, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న కీలక అధికారుల అలసత్వం ఎన్నికలను కనీసం అంచనా వేయలేకపోయారని జగన్ ఆగ్రహంగా ఉన్నారు. దీనితోనే కీలక అధికారులను ప్రభుత్వ పదవుల నుంచి తప్పించే విధంగా జగన్ అడుగులు వేస్తున్నారట. నిఘా విభాగం అధిపతి తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని కూడా తప్పించే విధంగా జగన్ ఇప్పటికే కసరత్తులు చేస్తున్నారు. ఆమె స్థానంలో కొత్త రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నియమించే యోచనలో జగన్ ఉన్నారట.
జగన్ ఇప్పటికే కొందరు సీనియర్ మంత్రులతో దీనిపై చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పరిపాలనలో అనుభవం బొత్స సత్యనారాయణతో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అలాగే మండలిలో పక్ష నేతగా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు లను సైతం జగన్ ఇప్పటికే చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. వారు కూడా మారిస్తే మంచిది అనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ మొదటి లేదా రెండో వారంలో ఈ మార్పు ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.