శభాష్ కేసీఆర్ అంటున్న దేశం…!

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు కరోనా కట్టడికి తీసుకున్న కొన్ని నిర్ణయాలు అదేవిధంగా అక్కడ అమలు చేస్తున్న విధానాలు ఆశ్చర్యంగా మారాయి. తెలంగాణలో కరోనా విస్తరిస్తుంది అని ముందే గ్రహించిన కేసీఆర్ అధికారులను అన్ని విధాలుగా అప్రమత్తం చేశారు. ముందు ఒక కేసు రాగానే ఆ తర్వాత, అధికారులను అప్రమత్తం చేయడమే కాకుండా మంత్రి వర్గాన్ని కూడా అప్రమత్తం చేసి వ్యాప్తి చెందకుండా ఉండేవిధంగా అడుగులు వేసారు. అయితే కరోనా వైరస్ విదేశీయులు నుంచి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి రావడంతో,

ఇప్పుడు తెలంగాణలో దాదాపు ఇరవైకి పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో కరోనాతో యుద్ధం చేయడానికి రంగంలోకి దిగింది. బస్టాండ్లు జన సమర్థ ప్రాంతాలు మెట్రోరైలు ప్రాంతాలు అదేవిధంగా వ్యాపార సముదాయాలు ఐటీ కంపెనీ ఉద్యోగులు ఉండే ప్రాంతాలు విదేశీయులు ఎక్కువగా నివాసం ఉండే ప్రాంతాల్లో శానిటేషన్ చేయడం మొదలుపెట్టారు తెలంగాణ అధికారులు. కరోనా వైరస్ ని ఎలా అయినా సరే తెలంగాణ నుంచి పూర్తి స్థాయిలో తరిమికొట్టాలి అని భావిస్తున్న కేసీఆర్…

ఇప్పుడు దానికి భారీగా నిధులు కేటాయించే అవకాశాలు కనబడుతున్నాయి. తెలంగాణ లో తిరిగే పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో భాగమైన మెట్రోరైలు అలాగే లోకల్ ట్రైన్లు అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ట్రైన్లు ,ఆటోలు, క్యాబ్లు వంటి వాటిని పూర్తిగా తనిఖీ చేసి శానిటేషన్ చేసిన తర్వాత మాత్రమే రవాణాకు అనుమతించాలని స్పష్టమైన ఆదేశాలు అధికారులకు ఇచ్చినట్లు తెలుస్తోంది.

తెలంగాణలో ఉండే ప్రతి సూపర్ మార్కెట్ అదేవిధంగా చిన్న చిన్న బస్టాండ్ కు కూడా శానిటేషన్ చేసిన తర్వాత మాత్రమే అక్కడికి జనాలను అనుమతించాలని కెసిఆర్ ఆదేశించినట్లు సమాచారం. సూపర్ మార్కెట్లు అదేవిధంగా అక్కడ వాడే కొన్ని పరికరాలను కూడా పూర్తిగా సానిటేషన్ చేసిన తర్వాత మాత్రమే లోనికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీనితో మున్సిపల్ శాఖ అధికారులు అన్ని విధాలుగా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news