సున్నా వడ్డీ విషయంలో వైసీపీ తొందర పడిందా…?

-

సున్నా వడ్డీ పథకం విషయంలో ఏపీ ప్రభుత్వం అనవసరంగా ఇబ్బంది పడుతుందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. సున్నా వడ్డీ పథకం తామే మొదలుపెట్టామని సిఎం జగన్ సహా అధికార పార్టీ నేతలు పదే పదే చెప్తూ వస్తున్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమం 2010 చివర్లోనే అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టారు, మహబూబ్ నగర్ లో జరిగిన బహిరంగ సభలో ఈ విషయాన్ని ప్రకటించారు.

సున్నా వడ్డీ రుణాలు ఇస్తున్నామని, వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం ఆ వడ్డీ అంతా ప్రభుత్వమే భరిస్తుంది అని, తాను ముఖ్యమంత్రి అయి ఏడాది అయింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మహిళల కోసం అందిస్తున్నా అన్నారు ఆయన. ఆ తర్వాత దీనిని చంద్రబాబు సర్కార్ కూడా కొనసాగించింది. తనకు ఎంతో ఇష్టమైన సంఘాలు డ్వాక్రా సంఘాలు అని, వాళ్లకు వడ్డీ లేని రుణాలు ఇస్తా అని చంద్రబాబు పేర్కొన్నారు.

దీని విషయంలో జగన్ సర్కార్ అనవసరంగా ప్రచారం చేసుకుని ఇబ్బంది పడింది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఉమ్మడి ఎపీలోనే ఈ కార్యక్రమం కొనసాగించారని ఇప్పుడు ఇదే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారని, కొత్తగా ఈ కార్యక్రమం అని చెప్పడంపై రెండు తెలుగురాష్ట్రాల్లో ఆశ్చర్యం వ్యక్తమైంది. జమ చేస్తే చెయ్యాలి గాని తాము కొనసాగిస్తున్నామని చెప్పాలి గాని ఇది ఎందుకు అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news