‘ అసహనానికి ‘ దగ్గరగా వెళుతున్న జనం ? భవిష్యత్తు ఎలా ఉండబోతోంది ?

-

కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవటం అందరికీ తెలిసినదే. మొదటిలో ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ఉంటుంది అని, పరిస్థితి అంత చేతిలోకి వస్తుందని భావించారు. కానీ దేశంలో కరోనా వైరస్ ఏ మాత్రం కంట్రోల్ లోకి రాలేదు. ఈ విషయం నడుస్తూ ఉండగానే ఇష్టం ఉన్నా లేకపోయినా కష్టంగా ఉన్నా సరే లాక్ డౌన్ నీ పొడిగించటం తప్పదని మే 3 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్చ్ 22 న ప్రకటించిన 21 రోజుల లాక్ డౌన్ ఏప్రిల్ 14న ముగియడంతో పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో మరో 19 రోజులు పొడిగిస్తూ మే 3 వరకు లాక్ డౌన్ ఉంటుందని మోడీ చెప్పటం జరిగింది.Coronavirus in India: How the Covid-19 pandemic affects Indiaఅయితే ప్రస్తుతం కూడా వైరస్ ప్రభావం ఉన్న కొద్ది పెరుగుతున్న తరుణంలో ఇళ్లకు పరిమితమైన జనాలు ప్రభుత్వాలపై మండిపడుతున్నారు. ఉద్యోగాలు లేక ఇంట్లో ఉన్న పిల్లలను పోషించలేక చాలామంది పేదవాళ్ళు మరియు మధ్యతరగతి ప్రజలు ముందునుండి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే అన్ని రాష్ట్రాలలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్న కొద్దీ బయట పడుతున్న తరుణంలో భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని తెగ ఆందోళన చెందుతున్నారు.

 

దేశంలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే వ్యవహారం మొత్తం అదుపు తప్పెలా కనిపిస్తూ ఉండడం తో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నీ జూన్ నెలాఖరు వరకు పొడిగించాలని అనుకుంటున్నట్లు కొత్తగా వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రజలంతా అసహనానికి గురవుతున్నారు. మరోపక్క ప్రభుత్వాలు ఇలానే వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో దొంగతనాలు దోపిడీలు చేసుకుని బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మేధావులు ప్రభుత్వాలకి వార్నింగ్ లు ఇస్తున్నారు.  

Read more RELATED
Recommended to you

Latest news