సాగుబడి నిర్వహణ: వరి ప్రత్యామ్నాయంగా.. యాసంగిలో ఈ పంటలు వేస్తే మేలు

-

యాసంగి సాగు మొదలుకాబోతోంది. ఇప్పటికే ప్రభుత్వాలు వరిని సాగు చేయద్దని చెప్పాయి. కొనుగోలుకు హమీ ఇవ్వడం లేదు. దీనికి తోడు దొడ్డువడ్లకు మార్కెట్ లేదు. ఇదిలా ఉంటే… వేసవిలో తక్కువ  పెట్టుబడి.. సరైన సాగు విధానాలు పాటిస్తే.. వరి కన్నా అధిక లాభాలు గడించవచ్చు.

ఏ నేలలో ఏ పంటలు సాగు చేస్తే బాగుంటుంది… దానికి అనువైన పంట ఏదనేది తెలిస్తే రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది. రైతులకు వరి కన్నా ఎక్కువ దిగుబడి, లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎకరం వరిసాగు చేసే నీటితో నాలుగు ఎకరాల ఆరుతడి పంటనను పండించవచ్చు.

వర్షాధారపు ఎర్రనేలలు జొన్నలు, ఉలువలు వేసేందుకు అనుకూలంగా ఉంటుంది. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు పంట చేతికి వస్తుంది. వర్షాధారపు నల్ల నేలలు జొన్నలు, కుసుమలు, ఆవాలు, శెనిగల సాగుకు అనుకూలంగా ఉంటాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం త్రుణ ధాన్యాలు, పప్పు దినుసుల ప్రాముఖ్యత పెరగుతోంది. ప్రభుత్వాలు కూడా పప్పు ధాన్యాలను ప్రోత్సహిస్తున్నాయి. నీటి సౌకర్యం ఉంటే ఎర్రనేలల్లో పెసళ్లు, మినుముల, అలసంద, ప్రొద్దు తిరుగుడు, కంది, ఆముదం వేసుకునే అవకాశం ఉంటుంది.

నీటి సౌకర్యం ఉన్న నల్ల నేలల్లో మొక్కజొన్న, పొద్దు తిరుగుడు పంటలను వేసుకునే అవకాశం ఉంది. 60-70 రోజుల వరకు పంట చేతికి అందివస్తుండటంతో… వరికి పత్యామ్నాయంగా ఈ పంటలను సాగుచేస్తే రైతులు లాభం పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news