కనకాంబరం కోసే ముందు ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి..

-

పూలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. అందుకే పూల తోటలను వేసే వాళ్ళు మంచి లాభాలను అర్జిస్తున్నారు.మొక్కలను మొగ్గ తోడిగే వరకూ మంచి ఫలితాలను అనుకుంటామని రైతులు అనుకుంటారు. అయితే కొత కోసే ముందు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మాత్రం  మంచి లాభాలను పొందవచ్చు.. కనకాంబరం కోసే ముందు, మార్కెట్ చేస్తున్న సమయంలో తీసుకోవాలసిన జాగ్రత్తలను ఇప్పుడు చూద్దాం..


కనకాంబరం పూలను దక్షిణ భారత దేశంలో తమిళనాడు కర్ణాటక, ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు.మామిడి, కొబ్బరి లాంటి తోటల్లో అంతర పంటగా కూడా సాగుచేయవచ్చు.కనకాంబరం బహువార్షిక పంట. ఇది 4-6 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. మార్కెట్‌లో ఎక్కువ ధర పలకడంతోపాటు పూల సాగుచేస్తున్న రైతులకు అధిక లాభాలు వస్తుండడం వల్ల ఎక్కువ మంది కనకాంబరం సాగుకు మొగ్గు చూపుతున్నారు.

ఈ పూలు అనేక రంగుల లో ఉంటాయి..ఎక్కువ మంది రైతులు ఎరుపు, నారింజ రంగు పూలను పండిస్తారు.అధిక తేమ, వేడి కల్గిన ప్రాంతాలు కనకాంబరం సాగు చేయడానికి అనుకూలము. ముఖ్యంగా కోస్తా జిల్లాల సాగు చేయుటకు అనువైనవి. పెరుగుదలకు 300 సెం. ఉష్ణోగ్రత చాలా అనుకూలము. చల్లని వాతావరణ పరిస్థితుల్లో పూలు దిగుబడి అధికంగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలో పూలు లేత రంగుకు మారి నాణ్యత తగ్గుతుంది. మరీ తక్కువ ఉష్ణోగ్రతను తట్టుకోలేదు.

2-3 నెలల తర్వాత కనకాంబరం పుష్పిస్తుంది. కనకాంబరం పువ్వులు స్పైక్ బేస్ నుండి వరుసగా తెరుచుకుంటాయి. పుష్పం పూర్తిగా తెరవడానికి దాదాపు 2 రోజులు పడుతుంది. కాబట్టి పూలను ప్రత్యామ్నాయ రోజులలో తెల్లవారుజామున కోయడం జరుగుతుంది. స్పైక్ యొక్క పొడవుపై ఆధారపడి, ఒక స్పైక్‌లో పుష్పించడం పూర్తి చేయడానికి దాదాపు 15-25 రోజులు పడుతుంది.మాములుగా మార్కెట్ లో గుడ్డ లేదా, పాలిథిన్ కవర్ లలో ఫ్యాక్ చేస్తారు. ఒక కిలోకు 15,000 పూలు తూగుతాయి.మార్కెట్ లో రేటుగా భారీగా ఉంటుంది.. అందుకే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మంచి లాభాలను పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news