పెసర పంటలో తెగుళ్ళ నివారణ చర్యలు..జాగ్రత్తలు..

-

పెసర పంట తక్కువ నీరు ఉన్న పండుతుంది..ఈ పంట తక్కువ రోజులలో అంటే కేవలం 30 రోజుల్లో పూత, కాత దశకు చేరుతుంది. తెగుళ్లు , పురుగులు ఆశించి పెసర పంటకు నష్టం కలిగిస్తాయి.ఈ పంటలో అన్నీ చర్యలను సకాలంలో తీసుకుంటే మంచిది. పెసర పంటను ప్రధానంగా ఆశించే తెగుళ్లు, వాటి నివారణపై రైతులు అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది.

పెసర తెగుళ్ళ నివారణ చర్యలు..

ఈ పెసరలో ముఖ్యంగా పొగాకు లద్దె పురుగు,తామర పురుగులు,పల్లాకు తెగులు,బూడిద తెగుళ్లు ఎక్కువగా వస్తాయి..

పొగాకు లద్దె పురుగు: పొగాకు లద్దె పురుగు ఆకుల్లోని పచ్చని పదార్ధాన్ని తినడం వల్ల ఆకులు తెల్లగా మారతాయి. పువ్వులను , పిందెలను కూడా తినేస్తాయి. ఈ పురుగు రాత్రిపూట ఎక్కువగా తిరుగుతుంది. పగలు మొక్కల మొదళ్లలో , భూమిలోకి చేరతాయి. నివారణకు విషు ఎర వెదజల్లాలి. ఎకరాకు మోనో క్రోటోఫాస్ 50 మిల్లీ లీటర్లు, 5కిలోల తవుడు, అరకిలో బెల్లం సరిపడా నీటితో కలిపి చిన్న ఉండలుగా చేసి సాయంత్రం సమయంలో వెదజల్లాలి. నోవాల్సరాన్ ఒక మిల్లీలీటర్ లేదా థయోడికార్బ్ ఒక గ్రామును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

తామర పురుగులు: తొలిదశలో లేత ఆకులపై వృద్ధి చెంది ఆకుల అడుగు భాగం నుండి రసాన్ని పీలుస్తాయి. ఆకు ముడత తెగులును తామర పురుగులు వ్యాప్తి చేస్తాయి. ఆకులు అంచులు వెనుకకు ముడుచుకొని మెలికలు తిరిగి గడసబారి రాలిపోతాయి. అడుగు భాగంలో ఈనెలు రక్తవర్ణాన్ని పోలి ఉంటాయి. లేత దశలో మాడి మొక్కలు ఎండుతాయి. ముదురు దశలో తెగులు పాక్షికంగా ఉండి తక్కువ కాపు ఉంటుంది. నివారణకు ఒక గ్రాము ఎసిఫేట్ ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి వైరస్ వ్యాప్తిని అరికట్టాలి.

బూడిద తెగులు : విత్తిన 30 రోజుల తరువాత గాలిలో తేమ ఎక్కువగా ఉన్న సమయంలో ముదురు ఆకులపై బూడిద రూపంలో చిన్నిచిన్న మచ్చలు కనబడతాయి. క్రమేపి అవి పెద్దవై ఆకుల అడుగు బాగాలకు వ్యాప్తి చెందుతాయి. నివారణకు ఒక గ్రాము కార్భండిజమ్ లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.

పల్లాకు తెగులు : తెగులు సోకిన మొక్కల ఆకులు, కాయల మీద పసుపు పొడలు ఏర్పడతాయి. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాప్తిస్తుంది. తెల్లదోమ నివారణకు లీటరు నీటికి 1.6 మిల్లీ లీటరు మోనో క్రొటోపాస్ కలిపి పిచికారీ చేయాలి..ఈ మందులను వాడి తెగుల్లను నివారించవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news