ధాన్యం నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..యాజమాన్య పద్ధతులు..

-

పంట పండించడం పెద్ద పని అనుకుంటారు.కానీ కోత సమయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి..పంటను మార్కెట్ కు చేర్చెవరకు కష్టపడాలి.కోత కోసే సమయంలో ధాన్యంలో 24 శాతం తేమ ఉండేలా చూసుకోవాలి. మార్కెట్ చేసే సమయంలో 10-12% ఉండేటట్లు ఎండలో ఆరబెట్టాలి..

ధాన్యం నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

*. నిల్వ ఉన్న పాతధాన్యాన్ని కొత్త ధాన్యంతో కలుపరాదు.

*. వీలైనంత వరకు క్రొత్త సంచులలో ధాన్యం నిలువ చేయాలి.

*. పాత సంచులను వాడేటప్పుడు పాతధాన్యం క్రిమికీటకాలు లేకుండా వాటిని శుభ్రపరిచి ఎండ బెట్టాలి.

*. ఈ సంచుల మీద 1లీ నీటికి 10మి.లీ మలాథియాన్ 5మి.లీ. డై క్లోరోవాన్ కలిపిన ద్రావణాన్ని పిచికారి చేసి ఆరనిచ్చి ధాన్యాన్ని నిల్వ చేయాలి.

*. ధాన్యం నింపిన బస్తాలను నేలకు, గోడలకు తగలకుండా తేమలేని పొడి ప్రదేశంలో చెక్క బల్లలమీద నిలువ చేయాలి.

*. 100kg ల ధాన్యానికి kg ల వేపగింజల పొడిని కలిపితే పురుగులు ఆశించవు.

*. కప్పులో పగుళ్ళు లేకుండా చూడాలి.

*. తలుపులకు కాశీలు, రంధ్రాలు లేకుండా చూడాలి.

*. అపరాలను చిక్కగా నేసిన జనపనార సంచులలో గాని లేదా పాలిథీన్ అమర్చిన సంచులలో గాని, నైలాన్ సంచులలోగాని నిల్వచేయాలి.

*. ఒక లీటరు నీటిలో 10మి.లీ మలాథియాన్ కలిపిన ద్రావణాన్ని ప్రతీ 100 చ.మీ 3 వంతున గోదాములలో ధాన్యం నిలువ చేసేముందు పిచికారి చేయాలి.
గోదాములలో ధాన్యం నిల్వ..

*.విషవాయువుతో గోదాములను నింపి పురుగు నివారణ చర్యలు తీసుకోవాలి.

*. గోదాములలో నిల్వ చేసిన ధాన్యం రక్షణకు టన్నుకు 3gr ఉండే అల్యూమినియం ఫాస్పైడ్ బిళ్ళలను 1 లేదా 2 ఉపయోగించాలి.

*. ఇథిలిన్ బ్రోమైడ్ ఒక క్వింటాళ్ళు ధాన్యానికి 5ml,1 క్వింటాలు అవరాలకు 3mil ఉపయోగించి గాలి వెలుపలికి పోకుండా 7 రోజుల వరకు జాగ్రత్త పడాలి.

వీటితో పాటు గోదాములలో కూడా బస్తాలను నిల్వ చేయడంలో మెలుకువలు పాటించాలి..ఏదైనా సందెహాలు ఉంటే వ్యవసాయ నిపునుల సలహాలను పాటించాలి..

Read more RELATED
Recommended to you

Latest news